జగన్‌పై భారత రాయబారి ప్రశంసలు!

| Edited By:

Aug 17, 2019 | 7:14 PM

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ విందు ఇచ్చారు. భారత రాయబార కార్యాలయ అధికారులు, 60 మందికిపైగా సీనియర్‌ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ నాయకత్వాన్ని భారత రాయబారి హర్షవర్ధన్‌ ప్రశంసించారు. సీఎం జగన్‌ సంకల్పం, స్థిరత్వం, పారదర్శక విధానాలు ఏపీని వ్యూహాత్మక మార్గంవైపు నడిపిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆయన అన్నారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికాలో భారత్‌ […]

జగన్‌పై భారత రాయబారి ప్రశంసలు!
Follow us on

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ విందు ఇచ్చారు. భారత రాయబార కార్యాలయ అధికారులు, 60 మందికిపైగా సీనియర్‌ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలు ఈ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ నాయకత్వాన్ని భారత రాయబారి హర్షవర్ధన్‌ ప్రశంసించారు. సీఎం జగన్‌ సంకల్పం, స్థిరత్వం, పారదర్శక విధానాలు ఏపీని వ్యూహాత్మక మార్గంవైపు నడిపిస్తున్నాయని, పెట్టుబడులను ఆకర్షిస్తాయని ఆయన అన్నారు. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అమెరికాలో భారత్‌ అధికారులు గట్టి పునాదులు వేశారని సీఎం జగన్‌ ప్రశంసించారు. రాష్ట్రంలో వ్యాపారాలకు, పెట్టుబడులకు కొత్త అవకాశాలున్నాయని వివరించారు. ఇవి ఏపీ, అమెరికాల మధ్య సంబంధాలను మరింత పెంచడమే కాకుండా, వ్యాపార, వాణిజ్య, ఇంధన రంగంలో సహకారం, సాంస్కృతిక రంగాల్లో పరస్పరం భాగస్వామ్యాలకు దారితీస్తుందని ఆకాంక్షించారు.