AUS vs IND 3rd Test Day 3: దెబ్బ మీద దెబ్బ.. పంత్, జడేజాకు గాయాలు.. రిపోర్టుల్లో తేడా వస్తే.. !

| Edited By: Pardhasaradhi Peri

Jan 09, 2021 | 6:24 PM

టీం ఇండియాకు మరో ఎదురు దెబ్బ తగలనుందా..? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ లాంటి స్టార్స్ లేకపోయినా.. బాక్సింగ్ డే టెస్టులో విజయ కేతనం ఎగరవేసిన భారత్ టీమ్‌కు..

AUS vs IND 3rd Test Day 3: దెబ్బ మీద దెబ్బ.. పంత్, జడేజాకు గాయాలు.. రిపోర్టుల్లో తేడా వస్తే.. !
Follow us on

AUS vs IND 3rd Test Day 3:  టీం ఇండియాకు మరో ఎదురు దెబ్బ తగలనుందా..? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ లాంటి స్టార్స్ లేకపోయినా.. బాక్సింగ్ డే టెస్టులో విజయ కేతనం ఎగరవేసిన భారత్ టీమ్‌కు.. ఇప్పుడు అనుకోని పరిణామం ఎదురైంది. బ్యాటింగ్ చేస్తూ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయపడ్డారు. ప్యాట్ కమిన్స్  బౌలింగ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా.. రిషబ్ పంత్ మో చేతికి గాయమైంది. వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించినా నొప్పిని భరించలేకపోయాడు. కాసేపటికే హెజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో డేవిడ్‌ వార్నర్‌ చేతికి చిక్కి పంత్ పెవిలియన్ చేరాడు. అనంతరం టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో‌ 244 పరుగులకు ఆలౌటయ్యాక.. పంత్‌ను స్కానింగ్‌ కోసం పంపడంతో.. వృద్ధిమాన్ సాహా కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా వికెట్ కీపింగ్ చేశాడు.  కాగా మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా ఎడమ చేతి బొటన వేలుకి కూడా గాయమైంది. బ్యాండ్ వేసుకుని బ్యాటింగ్ కొనసాగించాడు జడ్డూ. అయితే నొప్పి ఎక్కువగా ఉండటంతో ఫీల్డింగ్‌కి రాలేదు. అతని ప్లేసులో మయాంక్ అగర్వాల్ సబ్‌స్టిట్యూడ్ ఫీల్డింగ్ చేశాడు.

కాసేపటి క్రితం జడ్డూ వేలు నుంచి రక్తస్రావం కావడంతో స్కానింగ్ చేసేందుకు తరలించింది మెడికల్ టీమ్. గాయం తీవ్రత అధికంగా ఉంటే.. అతడు ఈ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే అవకాశం కుదరదు. మెదటి ఇన్సింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి జడేజా సత్తా చాటిన విషయం తెలిసిందే. అంతేకాదు బ్యాటింగ్‌లో సైతం రాణించాడు. ఒకవేళ గాయం తీవ్రత అధికంగా ఉండి సూపర్ ఫామ్‌లో ఉన్న జడేజా సేవలు జట్టుకు దూరమైతే.. సిరిస్ ఫలితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

భారత్‌తో జరిగిన మూడో టెస్టులో 3 వ రోజు ఆస్ట్రేలియా బౌలర్లు పిచ్‌లో అదనపు బౌన్స్ రాబట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో షార్ట్ పిచ్ బంతి ఆడే క్రమంలో రిషబ్ పంత్ మోచేయికి గాయమైంది. జడేజా కూడా ఓ బౌన్సర్‌ను ఆడే క్రమంలో ఈ ఇబ్బందిని ఎదుర్కున్నాడు.

Also Read : 

Sheep Distribution: గొల్ల, కురుమలకు గుడ్ న్యూస్.. మొదటి విడత గొర్రెల పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశం

Today Gold and Silver Price: గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..తాజా రేట్లు ఇలా ఉన్నాయి