యధావిధిగా బ్రిస్బేన్ టెస్టు.. బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టత.!

|

Jan 04, 2021 | 7:17 PM

India Vs Australia 2020: బ్రిస్బేన్‌లో క్వారంటైన్ రూల్స్‌ స్ట్రిక్ట్‌గా అమలవుతున్న నేపధ్యంలో నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా విముఖత..

యధావిధిగా బ్రిస్బేన్ టెస్టు.. బీసీసీఐ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు.. క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టత.!
Follow us on

India Vs Australia 2020: బ్రిస్బేన్‌లో క్వారంటైన్ రూల్స్‌ స్ట్రిక్ట్‌గా అమలవుతున్న నేపధ్యంలో నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోందంటూ వస్తున్న వార్తలను క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ నిక్ హోక్లి ఖండించారు. ”క్వీన్స్‌ల్యాండ్ క్వారంటైన్ రూల్స్‌కు బీసీసీఐ పూర్తి మద్దతు తెలుపుతోంది. ప్రతీ రోజూ మేము ఇక్కడి రూల్స్ విషయంలో బీసీసీఐతో చర్చలు జరుపుతూనే ఉన్నాం” అని నిక్ హోక్లి పేర్కొన్నారు.

‘నాలుగో టెస్టు వేదికను మార్చాలని బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. షెడ్యూల్ పరంగా సిరీస్ పూర్తి చేయాలని ఇరు జట్లూ అనుకుంటున్నాయి’ అని ఆయన అన్నారు. కాగా, భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ జనవరి 7వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమంగా ఉంది.

Also Read: వాహనదారులకు అలెర్ట్.. ఇకపై హెల్మెట్ ధరించకపోతే బైక్ స్వాధీనం.. అమలులోకి వచ్చిన కొత్త రూల్.!