India Vs Australia 2020: ఆస్ట్రేలియాకు గట్టి షాక్.. నాలుగో టెస్టుకు పుకోవిస్కీ దూరం..!

|

Jan 13, 2021 | 6:40 PM

India Vs Australia 2020: బ్రిస్బేన్‌లో జరగబోయే నాలుగో టెస్టుకు ముందు ఆతిధ్య ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగలనుంది. దేశవాళీ ప్రదర్శనతో...

India Vs Australia 2020: ఆస్ట్రేలియాకు గట్టి షాక్.. నాలుగో టెస్టుకు పుకోవిస్కీ దూరం..!
Follow us on

India Vs Australia 2020: బ్రిస్బేన్‌లో జరగబోయే నాలుగో టెస్టుకు ముందు ఆతిధ్య ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగలనుంది. దేశవాళీ ప్రదర్శనతో ఆకట్టుకుని మూడో టెస్టులో చోటు దక్కించుకున్న విల్ పుకోవిస్కీ.. భుజం గాయం కారణంగా చివరి మ్యాచ్‌కు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎముక కాస్త పట్టు తప్పిందని.. ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే పుకోవిస్కీ గాయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఒకవైపు రెగ్యులర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లో లేకపోవడం.. ఇప్పుడు పుకోవిస్కీ గాయం కారణంగా దూరమైతే మాత్రం ఓపెనింగ్‌పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఇక పుకోవిస్కీ ఫిట్‌గా లేకపోతే అతడి స్థానంలో మార్కస్ హారిస్ ఆడతాడని ఆ జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ చెప్పాడు. కాగా, టీమిండియాకు కూడా గాయాల బెడద వేధిస్తోంది. చివరి టెస్టుకు జట్టు కూర్పు ఎలా ఉండబోతోందో అన్న దానిపై స్పష్టత రాలేదు.