థార్ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా రద్దు చేసిన భారత్!

| Edited By:

Aug 16, 2019 | 7:41 PM

కశ్మీర్ అంశంపై పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి కరాచీని కలుపుతూ వెళ్లే థార్ లింక్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇండియన్ రైల్వే శుక్రవారంనాడు తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ రోజు వెళ్లాల్సిన థార్ లింక్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరలేదని వాయవ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి అభయ్ శర్మ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ థార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుల (అప్ అండ్ డౌన్) రద్దు కొనసాగుతుందని ఆయ చెప్పారు. పాకిస్థాన్ వెళ్లేందుకు ఈ […]

థార్ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా రద్దు చేసిన భారత్!
Follow us on

కశ్మీర్ అంశంపై పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నుంచి కరాచీని కలుపుతూ వెళ్లే థార్ లింక్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇండియన్ రైల్వే శుక్రవారంనాడు తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ రోజు వెళ్లాల్సిన థార్ లింక్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరలేదని వాయవ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి అభయ్ శర్మ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ థార్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసుల (అప్ అండ్ డౌన్) రద్దు కొనసాగుతుందని ఆయ చెప్పారు. పాకిస్థాన్ వెళ్లేందుకు ఈ రైలులో 45 మంది టిక్కెట్లు బుక్ చేసుకున్నట్టు తెలిపారు.

అయితే, ఈనెల 9వ తేదీన పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ ఇస్లామాబాద్‌లో ఒక ప్రకటన చేస్తూ, జోథ్‌పూర్‌కు వెళ్లే ఇవాల్టి రైలే చివరి రైలు అవుతుందని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించిన పాక్…ఇందుకు ప్రతిగా భారత్‌తో దౌత్యసంబంధాలకు ఉద్వాసన చెబుతున్నట్టు ప్రకటించింది. రెండు దేశాల మధ్య నడిచే థార్, సంజౌతా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేసింది.