పాక్‌లో ఉద్రిక్తత.. సిక్కులే టార్గెట్‌గా రాళ్ల దాడి.. ఖండించిన భారత్..

| Edited By:

Jan 04, 2020 | 4:45 AM

పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైనార్టీలైన సిక్కులే లక్ష్యంగా స్థానిక ముస్లింలు దాడికి పాల్పడ్డారు. గురుద్వారా నాన్‌కానా సాహిబ్‌పై రాళ్లు రువ్వారు. సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయలో.. ఈ దాడికి దిగారు. ఒకేసారి వందల మంది గురుద్వారాను చుట్టుముట్టి.. సిక్కులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా గురుద్వారా ప్రాంతమంతా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అయితే గతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన నేపథ్యంలోనే ఈ దాడి పునరావృతం అయినట్లు తెలుస్తోంది. […]

పాక్‌లో ఉద్రిక్తత.. సిక్కులే టార్గెట్‌గా రాళ్ల దాడి.. ఖండించిన భారత్..
Follow us on

పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైనార్టీలైన సిక్కులే లక్ష్యంగా స్థానిక ముస్లింలు దాడికి పాల్పడ్డారు. గురుద్వారా నాన్‌కానా సాహిబ్‌పై రాళ్లు రువ్వారు. సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయలో.. ఈ దాడికి దిగారు. ఒకేసారి వందల మంది గురుద్వారాను చుట్టుముట్టి.. సిక్కులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా గురుద్వారా ప్రాంతమంతా టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అయితే గతంలో జరిగిన సంఘటనకు సంబంధించిన నేపథ్యంలోనే ఈ దాడి పునరావృతం అయినట్లు తెలుస్తోంది. గతేడాది.. గురుద్వారా పతి.. కూతురు జగ్జీత్ కౌర్‌ను.. స్థానికంగా ఉండే మహ్మద్ హుస్సేన్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు ఆరోపణలున్నాయి. అనంతరం బలవంతంగా మతమార్పిడి చేసి వివాహం చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదంటూ జగ్జీత్ కౌర్ తనకు తానుగా మతం మార్చుకొని.. ఇష్టపూర్వకంగానే వివాహం చేసుకుందని హుస్సేన్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శుక్రవారం కొందరు వ్యక్తులు గురుద్వారా నాన్‌కాకా సాహిబ్ వద్దకు చేరుకొని రాళ్లు విసిరారు. సిక్కులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గురుద్వారా నాన్‌కానా సాహిబ్‌పై జరిగిన రాళ్ల దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. గురునానక్ దేవ్ జన్మించిన పవిత్ర స్థలమైన.. నాన్‌కానా సాహిబ్‌లో సిక్కులపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయని మండిపడింది. మైనార్టీ సిక్కుల భద్రత, సంక్షేమం కోసం పాక్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. గురుద్వారాతో పాటు సిక్కులపై దాడి చేసిన వారిపై.. తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, గురుద్వారా వద్ద జరిగిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను అకాలీదళ్ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాన్‌కానా సాహిబ్ దగ్గర గురుద్వారాను ముట్టడించిన అల్లరి మూకలు.. సిక్కు వ్యతిరేక నినాదాలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.