మాల్యాకు ఆశ్రయం ఇవ్వద్దు: భారత్

|

Jun 11, 2020 | 9:01 PM

విజయ్ మాల్యా ఆశ్రయం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరించొద్దని బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

మాల్యాకు ఆశ్రయం ఇవ్వద్దు: భారత్
Follow us on

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాను వదిలిపెట్టేదీలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. విజయ్ మాల్యా ఆశ్రయం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరించొద్దని బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మాల్యాను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఈ విషయంలో యూకేతో సంప్రదింపులు జరుపుతున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. భారత్‌లో తనను వేధిస్తారన్న మాల్యా ఆరోపణలకు ఎంతమాత్రం ఆధారాలు లేవన్న శ్రీవాస్తవ.. ఆశ్రయం కోసం అతడు పెట్టుకున్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవద్దని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.