ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు.. పన్ను ఎగవేతపై ఆదాయం ప‌న్ను శాఖ దూకుడు..

|

Jan 08, 2021 | 3:20 PM

వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఫుడ్ డెలివ‌రీ స్టార్టప్ స్విగ్గీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు.. పన్ను ఎగవేతపై ఆదాయం ప‌న్ను శాఖ దూకుడు..
Follow us on

Income tax Raids: పన్ను ఎగవేతకు సంబంధించిన కేసుల్లో ఆదాయం ప‌న్ను శాఖ అధికారులు దూకుడు పెంచారు. వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఫుడ్ డెలివ‌రీ స్టార్టప్ స్విగ్గీ ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రెండు కంపెనీల‌కు చెందిన థార్డ్ పార్టీ వెండ‌ర్లు ప‌న్ను ఎగ‌వేసిన‌ట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా బెంగుళూరులోని స్విగ్గీ, ఇన్‌స్టాకార్ట్ కార్యాల‌యాల్లో సోదాలు జ‌రిగిన‌ట్లు ఓ ఐటీ శాఖ అధికారి వెల్లడించారు.

ఈ కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లాజిస్టిక్స్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్‌లో గురువారం రాత్రి వ‌ర‌కు సోదాలు జ‌రిగిన‌ట్లు ఆ అధికారి తెలిపారు. ఇన్‌స్టాకార్ట్ ఆఫీసుకు చేరుకున్న సుమారు 20 మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు స‌మాచారం. అయితే, ఐటీ శాఖ చేస్తున్న త‌నిఖీల‌కు స‌హ‌క‌రిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఓ ప్రక‌ట‌న‌లో పేర్కొంది. అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని అందిస్తున్నట్లు ఆ సంస్థ చెప్పింది. తాము కూడా ఐటీ సోదాల‌కు స‌హ‌క‌రిస్తున్నట్లు అటు స్విగ్గీ సంస్థ ప్రతినిధులు కూడా తెలిపారు. కాగా, ఇప్పటీవరకు ఈ దాడులకు సంబంధించి ఐటీశాఖ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రక‌ట‌న చేయ‌లేదు.