దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు

|

Aug 23, 2020 | 10:37 AM

దేశంలో కరోనా విజృభణ కొన‌సాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 69,239 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

దేశంలో 30 లక్షలు దాటిన కరోనా కేసులు
Follow us on

దేశంలో కరోనా విజృంభణ కొన‌సాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 69,239 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. మరో 912 మంది కరోనా కార‌ణంగా చ‌నిపోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 30 లక్షల మార్క్​ను దాటింది.

దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30, 44,940
ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 7,07,668
వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 22,80,566
మొత్తం క‌రోనాతో చ‌నిపోయిన‌వారి సంఖ్య 56,706

పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ రిక‌వ‌రీల‌ సంఖ్య‌ కూడా క్రమంగా పెర‌గ‌డం కాస్త ఊర‌ట క‌లిగించే అంశం. ప్రస్తుతం ఇండియాలో కోవిడ్ బాధితుల రికవరీ రేటు దాదాపు 74.69శాతానికి చేరింది. మరణాల రేటు 1.87 శాతంగా ఉంది. దేశంలో రోజూ దాదాపు 8లక్షల శాంపిళ్లను టెస్ట్ చేస్తున్నారు.

 

Also Read :

వైఎస్‌ఆర్‌ ఆసరా స్కీమ్, రుణాలపై మార్గదర్శకాలు విడుదల

మరో కీలక అనుమతి పొందిన ‘కొవాగ్జిన్’ !

మ‌ర‌ణంలోనూ వీడ‌ని బంధం : భ‌ర్త మ‌ర‌ణ వార్త విని భార్య మృతి