ఇండియాలో కరోనా కల్లోలం : 24 గంటల్లో 986 మరణాలు

|

Oct 07, 2020 | 10:40 AM

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది.  గడిచిన 24 గంటల్లో 11,99,857 మందికి కరోనా టెస్టులు చేయగా, 72,049 మందికి వైరస్ నిర్థారణ అయ్యింది. 

ఇండియాలో కరోనా కల్లోలం : 24 గంటల్లో 986 మరణాలు
Follow us on

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది.  గడిచిన 24 గంటల్లో 11,99,857 మందికి కరోనా టెస్టులు చేయగా, 72,049 మందికి వైరస్ నిర్థారణ అయ్యింది.  కొత్తగా మరో 986 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.  దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 67, 57, 132కు పెరిగింది. దేశవ్యాప్తంగా 1,04,555 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తంగా 57 ,44,694 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 9,07,883 యాక్టివ్ కేసులున్నాయి. ( రేపే ‘జగనన్న విద్యా కానుక’, 42,34,322 మంది విద్యార్థులకు లబ్ధి )

అయితే కరోనా కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా అధికంగా ఉండటం కాస్త ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం  దేశవ్యాప్తంగా రికవరీ రేటు 85.02 శాతం ఉండగా..డెత్ రేటు 1.55 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ( కొనసాగుతోన్న ఉపరితల ద్రోణి, ఏపీకి వర్ష సూచన )