దేశంలో కరోనా తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 22,273 కొత్త పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,69,118కు చేరింది. కొత్తగా మరో 251 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 1,47,343కు చేరింది. శుక్రవారం కరోనా నుంచి కోలుకుని 22,274 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం రికవరీల సంఖ్య 97,40,108కు చేరింది . దేశంలో ప్రస్తుతం 2,81,667 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ శనివారం రిలీజ్ చేసిన హెల్త్ బలిటెన్ తెలిపింది.
పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ..జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు.
Also Read : స్నేహితురాలిని వేధించినవారిని అడ్డుకునేందుకు జర్నలిస్ట్ యత్నం, దుండగుల దాడి, ఆసుపత్రిలో బాధితుని మృతి