India-Bangladesh JCC meet: భారత్-బంగ్లా విదేశాంగ మంత్రుల కీలక చర్చలు

|

Sep 30, 2020 | 1:04 PM

భారత-బంగ్లాదేశ్ జాయింట్ కన్సల్టేటివ్ కమిషన్ (జెసిసి) ఆరవ సమావేశం 2020 సెప్టెంబర్ 29 న జరిగింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎకె అబ్దుల్ మోమెన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

India-Bangladesh JCC meet: భారత్-బంగ్లా విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
Follow us on

భారత-బంగ్లాదేశ్ జాయింట్ కన్సల్టేటివ్ కమిషన్ (జెసిసి) ఆరవ సమావేశం 2020 సెప్టెంబర్ 29 న జరిగింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎకె అబ్దుల్ మోమెన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ,  బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య జరగనున్న వర్చువల్ సమ్మిట్ స్థాయి సమావేశానికి ఇరువర్గాలు నిర్ణయించాయి. 

ఎస్ జైశంకర్ మాట్లాడుతూ “ఈ రోజు, మా బహుముఖ సహకారం, ఎక్సలెన్సీపై సమీక్ష జరిపాం.  ‘షోనాలి అధ్యాయనం’లో రాసుకున్న అంశాల విషయంలో మా నాయకుల మార్గనిర్దేశం మేరకు మనోభావాలను పరస్పరం గౌరవించుకుంటాం. మా ఇద్దరు ప్రధానమంత్రుల మధ్య జరగబోయే వర్చువల్ శిఖరాగ్ర సమావేశం కోసం ఎదురుచూస్తున్నాం. ”అని పేర్కొన్నారు. 

జాయింట్ కన్సల్టేటివ్ కమిషన్ ముగిసిన తరువాత ఇరు దేశాల ప్రతినిధులు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. “2020 డిసెంబర్‌లో వర్చువల్ ప్రధాని స్థాయి శిఖరాగ్ర సమావేశాన్ని ఇరువర్గాలు స్వాగతిస్తున్నాయి. కోవిడ్ వ్యాప్తి కారణంగా 2020 మార్చిలో భారత ప్రధాని బంగ్లా పర్యటన వాయిదా పడింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర  50 వ వార్షికోత్సవ వేడుకలు, ఇరు దేశాల దౌత్య సంబంధాల స్థాపనల నేపథ్యంలో  ఆ పర్యటన  తిరిగి షెడ్యూల్ అవుతుందని ఇరు పక్షాలు భావిస్తున్నాయి” అని పేర్కొన్నాయి.

బంగ్లాదేశ్ వ్యవస్థాపక దార్శనికుడు షేక్ ముజిబూర్ రెహ్మాన్ గౌరవార్థం కార్యక్రమాలను నిర్వహించే ప్రణాళికలపై ఇరు పక్షాలు ఈ సమావేశంలో చర్చించాయి. డిసెంబర్ 16, 2020 న షేక్ ముజిబూర్ రెహ్మాన్ జన్మదినోత్సవం సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్ ప్రారంభించాలన్న భారత నిర్ణయాన్ని విదేశాంగ మంత్రి ప్రకటించారు. రోహింగ్యా శరణార్థుల సున్నితమైన సమస్య కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.

Also Read :

Breaking : బాబ్రీ మసీదు కేసు కొట్టివేత, అందరూ నిర్దోషులే

టీటీడీ అర్చకునికి 6 నెలల జైలు శిక్ష