భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. విహారి, పృథ్వీ షా, సాహాలకు చోటు..గులాబీ బంతితో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌

|

Dec 17, 2020 | 5:39 AM

ఆసీస్ తో టెస్ట్ పోరుకు టీమిండియా రెడీ అయింది. వన్డే సిరీస్‌ను కంగారూలు గెలుచుకుంటే.. టీ20 సిరీస్‌ కోహ్లీసేన కైవసం చేసుకుంది.

భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. విహారి, పృథ్వీ షా, సాహాలకు చోటు..గులాబీ బంతితో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌
Follow us on

ఆసీస్ తో టెస్ట్ పోరుకు టీమిండియా రెడీ అయింది. వన్డే సిరీస్‌ను కంగారూలు గెలుచుకుంటే.. టీ20 సిరీస్‌ కోహ్లీసేన కైవసం చేసుకుంది. బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా నేటి నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. అడిలైడ్‌ వేదికగా జరుగుతున్న ఈ పోరును గులాబీ బంతితో డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌గా నిర్వహించనుండటం విశేషం. మ్యాచ్‌కు రోజు ముందే భారత మేనేజ్‌మెంట్‌ తమ తుది జట్టును ప్రకటించింది.  మయాంక్‌తో పాటు మరో ఓపెనర్‌గా గిల్‌ను కాదని పృథ్వీ షాకు అవకాశం ఇచ్చింది. ఇక వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ను పక్కనపెట్టి సీనియర్‌ ప్లేయర్‌ వృద్ధిమాన్‌ సాహాను ఎంపిక చేశారు. బ్యాటింగ్‌లో పంత్‌దే పైచేయిగా ఉన్నా… వికెట్‌ కీపింగ్‌లో తిరుగులేని సాహాకే జట్టు ఓటేసింది భారత మేనేజ్‌మెంట్. షమీ, బుమ్రా, ఉమేశ్‌ రూపంలో ముగ్గురు పేసర్లకు చాన్సిచ్చిన భారత్‌.. ఏకైక స్పిన్నర్‌గా అశ్విన్‌ వైపు మొగ్గు చూపింది. ఇక విరాట్‌, పుజారా, రహానే.. నైపుణ్యంపైనే ఈ సిరీస్‌ ఫలితం ఆధారపడి ఉండనుంది. గత పర్యటనలో కోహ్లీ, రహానే పెద్దగా ఆకట్టుకోక పోయారు. బౌలింగ్‌లో బుమ్రా, షమీపైనే ఎక్కువ భారం ఉండనుంది.