మరింత పెరిగిన ఉల్లి ధర.. ఇప్పుడెంతో తెలుసా..?

| Edited By: Pardhasaradhi Peri

Oct 09, 2020 | 6:45 PM

ఉల్లి కోసినా ఘాటె... కొన్నా ఘాటు అన్నట్లే ఉంది. ఉల్లిపాయలు కొనాలంటేనే వాటి ధర ఘాటుకు కన్నీళ్లొస్తున్నాయ్‌. ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరతో సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు. కడపజిల్లాలో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి

మరింత పెరిగిన ఉల్లి ధర.. ఇప్పుడెంతో తెలుసా..?
Follow us on

Onion Price : ఉల్లి కోసినా ఘాటె… కొన్నా ఘాటు అన్నట్లే ఉంది. ఉల్లిపాయలు కొనాలంటేనే వాటి ధర ఘాటుకు కన్నీళ్లొస్తున్నాయి‌. ఒక్కసారిగా పెరిగిన ఉల్లి ధరతో సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు. కడపజిల్లాలో ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి‌. నెలరోజుల క్రితం రూ. 25 ఉన్న ఉల్లిధర…ప్రస్తుతం రెట్టింపు అయ్యింది. కిలో ఉల్లి రూ. 50 నుంచి రూ.60లకు చేరింది. ఈ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.

దేశవ్యాప్తంగా ఉల్లి సాగయ్యే రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో రాష్ట్రానికి దిగుమతులు తగ్గిపోయాయి. దాంతో ఉల్లి ధరలు రెట్టింపయ్యాయి. మరోవైపు వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయి… ఉల్లిపాయ ధరలను అమాంతం పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉల్లిఘాటుకు ప్రజలు కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

బయట మార్కెట్లో కిలో ఉల్లి ధర 60 నుండి 70 రూపాయలకు అమ్ముతున్నారు‌. మార్కెట్‌ వెళ్లిన రైతులను వ్యాపారులు నిలువునా మోసం చేస్తున్నారు. రైతుల నుంచి కేవలం 20 నుండి 30 రూపాయలకే ఉల్లి కొంటున్నారు వ్యాపారులు.