కేంద్రమంత్రులపై క్రిమినల్ కేసులు…

| Edited By:

Jun 01, 2019 | 5:42 PM

నరేంద్రమోదీ నేతృత్వంలోని నూతన కేంద్ర మంత్రివర్గంలో 57 మంది సభ్యులుండగా వీరిలో 22 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని తేలింది. పలువురు కేంద్రమంత్రులపై ఉగ్రవాదం, హత్యలు, దహనాలు, అత్యాచారం, దొంగతనాలు, మతకలహాలు, కిడ్నాప్ లాంటి కేసులున్నాయని వారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లే చెబుతున్నాయి. కేంద్రమంత్రులు ప్రతాప్ చంద్ర సారంగి, బాబుల్ సుప్రియో, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషిలు మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని పోలీసులు కేసులు పెట్టారు. భాషా, […]

కేంద్రమంత్రులపై క్రిమినల్ కేసులు...
Follow us on

నరేంద్రమోదీ నేతృత్వంలోని నూతన కేంద్ర మంత్రివర్గంలో 57 మంది సభ్యులుండగా వీరిలో 22 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నాయని తేలింది. పలువురు కేంద్రమంత్రులపై ఉగ్రవాదం, హత్యలు, దహనాలు, అత్యాచారం, దొంగతనాలు, మతకలహాలు, కిడ్నాప్ లాంటి కేసులున్నాయని వారు కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లే చెబుతున్నాయి. కేంద్రమంత్రులు ప్రతాప్ చంద్ర సారంగి, బాబుల్ సుప్రియో, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, అమిత్ షా, ప్రహ్లాద్ జోషిలు మతపరమైన ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని పోలీసులు కేసులు పెట్టారు.

భాషా, నివాస, ప్రాంతాల వారీగా అల్లర్లు లేపారని ఆరుగురు కేంద్రమంత్రులపై ఐపీసీ సెక్సన్ 153 ఏ కింద నమోదైన కేసులున్నాయి. మరో ముగ్గురు కేంద్రమంత్రులు అశ్వనీకుమార్ చౌబే, నితిన్ గడ్కరీ, గిరిరాజ్‌సింగ్‌లు ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచి ప్రభావితం చేశారని కేసులు నమోదయ్యాయి. విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు వి. మురళీధరన్ పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో ఉంది. కేంద్ర మంత్రుల్లో 39 శాతం మందిపై క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయి.