ఒక్క అవకాశం ఇవ్వండి: మోదీకి ఇమ్రాన్ విఙ్ఞప్తి

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:45 PM

తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీని కోరారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. మోదీ ఇచ్చిన సవాల్‌పై స్పందించిన ఇమ్రాన్ ఖాన్.. తన మాటకు కట్టుబడి ఉన్నానని, పుల్వామా ఘటనకు స్పందించిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని  చెప్పారు. ఈ మేరకు పాక్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. అయితే ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైనప్పుడు తాను మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానని.. ఆ సమయంలో ‘‘ఇన్ని రోజులు […]

ఒక్క అవకాశం ఇవ్వండి: మోదీకి ఇమ్రాన్ విఙ్ఞప్తి
Follow us on

తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీని కోరారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. మోదీ ఇచ్చిన సవాల్‌పై స్పందించిన ఇమ్రాన్ ఖాన్.. తన మాటకు కట్టుబడి ఉన్నానని, పుల్వామా ఘటనకు స్పందించిన ఆధారాలు ఉంటే ఇవ్వాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని  చెప్పారు. ఈ మేరకు పాక్ ప్రధాని కార్యాలయం పేర్కొంది.

అయితే ఇమ్రాన్ ఖాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైనప్పుడు తాను మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానని.. ఆ సమయంలో ‘‘ఇన్ని రోజులు పోట్లాడుకున్నాం. ఇకపై చేతులు కలిపి పేదరికం, నిరక్షరాస్యతలను రూపుమామేందుకు కృషి చేద్దామని’’ ఆయనతో చెప్పానని మోదీ అన్నారు. దానికి ఇమ్రాన్ ఒప్పుకుంటూ ‘‘తాను పఠాన్‌ల కుమారుడిననీ, అబద్ధాలు చెప్పనని అన్నారని’’.. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటారో లేదో చూద్దాం అంటూ మోదీ సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై స్పందించిన ఇమ్రాన్.. శాంతి కోసం తనకు ఒక్క చాన్స్ కావాలని కోరారు. కాగా పుల్వామా ఘటన తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.