సెప్టెంబర్‌లో.. ఇగ్నో ఫైనల్ ఇయర్, చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు..

| Edited By:

Jul 23, 2020 | 1:50 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి, కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) జూన్ టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్

సెప్టెంబర్‌లో.. ఇగ్నో ఫైనల్ ఇయర్, చివ‌రి సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు..
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా పరీక్షలు రద్దయ్యాయి, కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) జూన్ టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్, ఫైనల్ ఇయర్, ఎండ్ సెమిస్టర్ విద్యార్థులకు సెప్టెంబర్‌ మొదటి వారంలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ల చివరి సంవత్సరం, చివరి సెమిస్టర్ విద్యార్థులకు సెప్టెంబర్ మొదటి వారం నుండి జూన్ ట‌ర్మ్ ఎండ్ ఎగ్గామినేష‌న్ (టీఈఈ)ను నిర్వహిస్తామని ఓపెన్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

కరోనా మహమ్మారి కారణంగా సెప్టెంబరులో జరగబోయే ట‌ర్మ్ ఎండ్ ఎగ్గామినేష‌న్ లో హాజరుకాని విద్యార్థులకు 2020 డిసెంబర్‌లో జరగనున్న ట‌ర్మ్ ఎండ్ ఎగ్గామినేష‌న్ లో అవకాశం ఇవ్వబడుతుంది అని ఇగ్నో తెలిపింది. కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (హెచ్ఆర్డీ), యూజీసీ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని వెల్ల‌డించింది. క‌రోనా వ‌ల్ల ప‌రీక్ష‌లు రాయ‌లేనివారికి డిసెంబ‌ర్‌లో అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని పేర్కొంది. సెప్టెంబ‌ర్‌లో ప‌రీక్ష రాయాల‌నుకునేవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

Also Read: ఎంట్రెన్స్‌ పరీక్షలు రద్దు.. డీమ్డ్‌ వర్సిటీలకు డిమాండ్..