ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను

|

Jul 26, 2020 | 8:03 AM

If I am sent to gallows, I will be blessed  : మసీదు కూల్చివేత కేసులో తీర్పు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. ఒకవేళ నన్ను ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తానని పేర్కొన్నారు. తను పుట్టిన ప్రదేశంలోని ప్రజలు కూడా సంతోషిస్తారని అన్నారు. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సీబీఐ కోర్టు ఆదేశించిందని.. దీంతో ఈ నెల ప్రారంభంలో లక్నోలోని సీబీఐ […]

ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తాను
Follow us on

If I am sent to gallows, I will be blessed  : మసీదు కూల్చివేత కేసులో తీర్పు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు ఉమా భారతి స్పష్టం చేశారు. ఒకవేళ నన్ను ఉరి తీసినా ఆశీర్వాదంగానే భావిస్తానని పేర్కొన్నారు.

తను పుట్టిన ప్రదేశంలోని ప్రజలు కూడా సంతోషిస్తారని అన్నారు. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా సీబీఐ కోర్టు ఆదేశించిందని.. దీంతో ఈ నెల ప్రారంభంలో లక్నోలోని సీబీఐ కోర్టులో వాంగ్మూలాన్ని ఇచ్చానని వెల్లడించారు. తీర్పు ఎలా వస్తుందన్న దాని గురించి ఆలోచించడం లేదని చెప్పారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేతకు కుట్ర పన్నారంటూ ఉమాభారతి, అద్వానీ, మురళీమనోహర్‌ జోషి తదితరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.