కరోనాపై ముగిసిన సర్వే.. 30 గ్రామాల్లో సీరం శాంపిల్స్

|

Aug 28, 2020 | 7:34 PM

తెలంగాణలో కరోనా ప్రభావంపై రెండో విడత ICMR-NIN సర్వే ముగిసింది. జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మూడు రోజులపాటు ఈ సర్వే నిర్వహించారు. వైద్య సిబ్బంది ఆయా జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు.

కరోనాపై ముగిసిన సర్వే.. 30 గ్రామాల్లో సీరం శాంపిల్స్
Follow us on

ICMR-NIN survey : తెలంగాణలో కరోనా ప్రభావంపై రెండో విడత ICMR-NIN సర్వే ముగిసింది. జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మూడు రోజులపాటు ఈ సర్వే నిర్వహించారు. వైద్య సిబ్బంది ఆయా జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు.

కరోనాతో సాధారణ ప్రజల్లో యాంటీబాడీస్‌ ఏ స్థాయిలో ఉన్నాయో శాంపిల్స్‌ సేకరించారు. 60 మంది సిబ్బందితో 1200 మంది రక్త నమూనాలు తీసుకున్నారు. జిల్లాకు 10 గ్రామాల చొప్పున 30 గ్రామాల్లో సీరం శాంపిల్స్‌ సేకరించారు. వాటిని చెన్నై ఐసీఎంఆర్‌ ల్యాబ్‌కు పంపించారు.

తెలంగాణ ప్రజల్లో 48 శాతం యాంటీబాడీస్‌ ఉన్నాయో లేదో ఈ సర్వే తేల్చనుంది. పరిశోధనా బృందానికి NIN శాస్త్రవేత్త డాక్టర్‌ లక్ష్మయ్య నాయకత్వం వహించారు. రెండు వారాల్లో ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. కరోనా మొదలైన కాలంలో చేసిన సర్వేలో 3 శాతం ప్రజల్లో యాంటీబాడీస్ ఉన్నట్లు గుర్తించారు.