Breaking: గాంధీలో కరోనా పేషంట్లపై క్లినికల్ ట్రయల్స్ కు ఐసిఎంఆర్ గ్రీన్ సిగ్న‌ల్..

|

Jun 24, 2020 | 10:45 PM

తెలంగాణ‌లో క‌రోనా వ‌ల్ల‌ చావు బతుకుల మధ్య ఉన్న వారిని బతికించే ప్రయత్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఒకటి రెండు మందులను క్లీనికల్ ట్రయల్స్ చేయడానికి ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చింది.

Breaking: గాంధీలో కరోనా పేషంట్లపై క్లినికల్ ట్రయల్స్ కు ఐసిఎంఆర్ గ్రీన్ సిగ్న‌ల్..
Follow us on

తెలంగాణ‌లో క‌రోనా వ‌ల్ల‌ చావు బతుకుల మధ్య ఉన్న వారిని బతికించే ప్రయత్నాలు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. ఒకటి రెండు మందులను క్లీనికల్ ట్రయల్స్ చేయడానికి ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చింది. ప్ర‌స్తుతం రెమ్ డెస్వీర్ ఇంజక్షన్ ను అత్య‌వ‌స‌రంగా ఉప‌యోగిస్తున్నారు గాంధీ వైద్యులు. ఫెలిపిరవీర్ లాంటి మందులను సైతం క‌రోనాతో క్రిటిక‌ల్ కండీష‌న్ లో ఉన్న రోగుల‌పై ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి యాంటి బైటిక్స్ ను ఉపయోగించారు గాంధీ వైద్యులు.

కాగా గ‌తంలో ఐసిఎంఆర్ అనుమతితో ప్లాస్మా ట్రీట్ మెంట్ ను ప్రయోగించి గాంధీ ఆస్ప‌త్రి అనుకూల ఫ‌లితాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా క‌రోనా పేషంట్లపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయ‌ని కాళోజి హెల్త్ యూనివర్సిటీ వీసీ, కరోనా కేసుల ఎక్స్పర్ట్ కమిటి మెంబర్ కరుణాకర్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణలో ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం కరోనాకి మందులు కోసం క్లినికల్ ట్రయిల్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగులపై క్లినికల్ ట్రయిల్ నిర్వహించిన‌ట్లు వెల్ల‌డించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కి డ్రగ్ కనుక్కునేందుకు పరిశోధనలు జరుగుతున్నాయని.. అందులో భాగంగానే గాంధీ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయిల్ నిర్వహిస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. .