టాప్ సెకెండ్‌లో టీమిండియా..అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ ఎక్కడుందంటే..?

|

Dec 15, 2020 | 5:31 PM

టెస్టు చాంపియన్‌షిప్‌కు సంబంధించి ఐసీసీ తాజా ర్యాంకులను విడుదల చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా ఆ జట్టు 300 పాయింట్లు, 63 శాతం ఎర్నింగ్‌ పాయింట్స్‌తో మూడో స్థానానికి...

టాప్ సెకెండ్‌లో టీమిండియా..అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా.. పాకిస్తాన్ ఎక్కడుందంటే..?
Follow us on

ICC Test Rankings : టెస్టు చాంపియన్‌షిప్‌కు సంబంధించి ఐసీసీ తాజా ర్యాంకులను విడుదల చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా ఆ జట్టు 300 పాయింట్లు, 63 శాతం ఎర్నింగ్‌ పాయింట్స్‌తో మూడో స్థానానికి చేరింది. విండీస్‌ మాత్రం 40 పాయింట్లు, 11శాతం ఎర్నింగ్‌ పాయింట్స్‌తో ఏడో స్థానంలో నిలిచింది.

ఇక 296 పాయింట్లు, 82 శాతం ఎర్నింగ్‌ పాయింట్స్‌తో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌ ఉండగా… 360 పాయింట్లు, 75 శాతం ఎర్నింగ్‌ పాయింట్స్‌తో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. భారత్‌కు ఆసీస్‌ కన్నా ఎక్కువ పాయింట్లు ఉన్నా.. ఎర్నింగ్‌ పాయింట్స్‌ తక్కువగా ఉండడంతో రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలు వరుసగా 4,5,6 స్థానాల్లో నిలిచాయి. ఇక డిసెంబర్‌ 17 నుంచి ఆసీస్‌, టీమిండియాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ మొదలుకానున్న విషయం తెలిసిందే.