83 తేజస్ విమానాల కొనుగోలు..?: ఐఏఎఫ్

| Edited By:

May 15, 2020 | 6:04 PM

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ‌నుంచి 83

83 తేజస్ విమానాల కొనుగోలు..?: ఐఏఎఫ్
Follow us on

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్ డౌన్ లో ఉండిపోయింది. అయితే.. తాజాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ‌నుంచి 83 తేజెస్ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. దేశీయంగా తయారైన ఉత్పత్తులతోనే రక్షణావసరాలు తీర్చుకోవాలనే విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు, సీడీఎస్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

Also Watch: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

దీనికి సంబంధించి ఎయిర్ ఫోర్స్ 40 తేజస్ విమానాలకు ఆర్డరిచ్చింది. వీటి విలువ 6 బిలియన్ డాలర్లు. అదనంగా మరో 83 ఫైటర్ విమానాలను కొనుగోలు చేసేందుకు వాయుసేన రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా రక్షణ వ్యవస్థల ఎగుమతి దారుగా భారత్ ఎదిగే అవకాశం కలుగుతుందని సీడీఎస్ బిపిన్ రావత్ తెలిపారు. 114 యుద్ధ విమానాల కోసం రెండేళ్ల క్రితం టెండర్ల పిలిచిన భారత్ తాజాగా తేజస్ వైపు మొగ్గు చూపడం ఆసక్తికర పరిణామమని రక్షణ రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: కరోనా అదుపులోకి వచ్చాకే స్కూళ్ళు..: కేంద్ర మంత్రి  

Also Read: తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపా.. పొడిగింపా..!