ఒకే వారంలో 35 సినిమాలకు ఓకే చెప్పా!

నటుడు పోసాని కృష్టమురళి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రచయితగా, డైరెక్టర్‌గా, నటుడిగా ఆయనకి టాలీవుడ్‌లో సపరేట్ స్థానం ఉంది. కమెడియన్ పృథ్వీపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్‌ అవ్వడంతో.. ఈ మధ్య మరోసారి పోసాని అన్ని న్యూస్‌ ఛానెల్స్‌లోనూ కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన వ్యక్తిగత వివరాలను బయటపెట్టారు. తనది గుంటూరు జిల్లాలోని కాకాని అని, పై చదువుల కోసం చెన్నై వెళ్లానన్నారు. ఒక వైపు చదువుకుంటూనే, మరోవైపు […]

ఒకే వారంలో 35 సినిమాలకు ఓకే చెప్పా!

Updated on: Jan 16, 2020 | 4:50 PM

నటుడు పోసాని కృష్టమురళి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. రచయితగా, డైరెక్టర్‌గా, నటుడిగా ఆయనకి టాలీవుడ్‌లో సపరేట్ స్థానం ఉంది. కమెడియన్ పృథ్వీపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్‌ అవ్వడంతో.. ఈ మధ్య మరోసారి పోసాని అన్ని న్యూస్‌ ఛానెల్స్‌లోనూ కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన వ్యక్తిగత వివరాలను బయటపెట్టారు.

తనది గుంటూరు జిల్లాలోని కాకాని అని, పై చదువుల కోసం చెన్నై వెళ్లానన్నారు. ఒక వైపు చదువుకుంటూనే, మరోవైపు పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్‌గా చేసేవాడినని తెలిపారు. ముందు రచయితగా 100 సినిమాల వరకూ పనిచేశానని, ఆ తర్వాత దర్శకుడిగా పరిచయమై.. ‘మెంటల్ కృష్ణ’ సినిమాతో నటుడు అయినట్లు ఆయన చెప్పారు. మెంటల్ కృష్ణ‌ సినిమాలో నా యాక్టింగ్‌కి మంచి పేరు వచ్చిందని, ఆ తరువాత నుంచి వరుసగా సినిమాలు చేసినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో దాదాపు ఒకే వారంలో 35 సినిమాలు ఒప్పుకున్నట్లు పోసాని తెలిపారు. అలాగే ఈ 30 ఏళ్లలో నేను ఇప్పటివరకూ ఖాళీగా లేనని.. అదే నాకు పెద్ద విశేషమని చెప్పారు పోసాని.

Loading...
Unable to load recommendations.
Follow Us