పవన్‌తో నటించడానికి నేను రెడీ అన్నారు కమేడియన్ ఆలీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ ఆలీ మంచి స్నేహితులని ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే. దాదాపు పవన్ నటించిన అన్ని సినిమాల్లోనూ ఆలీ కనిపిస్తూనే ఉంటారు. ఆలీ సినిమాలో ఉండటం పవన్‌కు కూడా సెంటిమెంటే. అయితే.. గతేడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి మధ్యా విభేదాలు తలెత్తాయి. నిజానికి పవన్ పెట్టిన పార్టీలోనే ఆలీ చేరుతారని అందరూ అనుకున్నా.. అందుకు భిన్నంగా ఆయన వైసీపీలో చేరారు.
ఇక ఆ తరువాత పవన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం విదితమే. బాలీవుడ్లో అమితాబ్ నటించిన ‘పింక్’ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. ఇటీవలే ‘పింక్’ రీమేక్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఈ సందర్భంగా కొన్ని వార్తలు ఫుల్‌గా వైరల్ అయ్యాయి. అందులో ఆలీని పవన్.. తన సినిమాలోకి చేయమని ఆహ్వానించారనేది కూడా ఒక న్యూస్.
‘దీనికి స్పందించిన ఆలీ తాను పవన్ సినిమాలో నటించడానికి రెడీ అని, రాజకీయాలు వేరు, సినిమా వేరని పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పారు ఆలీ. అయితే.. ఇప్పటివరకూ పవన్ సినిమాలో చేయాలని నన్ను ఎవరూ ఆహ్వానించలేదని.. ఒకవేళ చేయమంటే తప్పనిసరిగా నటిస్తానని’ ఆలీ చెప్పడం విశేషం. ఏదేమైనా మళ్లీ వీరిద్దరూ కలిస్తే.. ఫ్యాన్స్‌కి పండగే కదా.