టీటీడీ చైర్మన్ పదవిపై మోహన్ బాబు క్లారిటీ

| Edited By: Anil kumar poka

Jun 05, 2019 | 11:57 AM

ప్రఖ్యాత టీటీడీ సహా అన్ని దేవాలయాల బోర్డులను రద్దు చేసే దిశగా ఏపీలో అడుగులు పడుతున్నాయి. పాలకమండలిల రద్దుపై ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ రేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఉన్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోహన్ బాబు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి బంధువు అవ్వడంతో పాటు.. తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి అవ్వడంతో టీటీడీ […]

టీటీడీ చైర్మన్ పదవిపై మోహన్ బాబు క్లారిటీ
Follow us on

ప్రఖ్యాత టీటీడీ సహా అన్ని దేవాలయాల బోర్డులను రద్దు చేసే దిశగా ఏపీలో అడుగులు పడుతున్నాయి. పాలకమండలిల రద్దుపై ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ రేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబు ఉన్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న మోహన్ బాబు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి బంధువు అవ్వడంతో పాటు.. తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి అవ్వడంతో టీటీడీ చైర్మన్ పదవి దక్కనుందని గుసగుసలు వినిపించాయి. ఇవి కాస్త మోహన్ బాబు దగ్గరకు చేరడంతో.. వీటిపై ఆయన స్పష్టతను ఇచ్చారు.

‘‘నేను టీటీడీ చైర్మన్ పదవి రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి పలువురు నాకు ఫోన్ కూడా చేస్తున్నారు. నేను జగన్‌ను సీఎంగా చూడాలనుకున్నాను. ఆయనను ముఖ్యమంత్రి చేసేందుకు నా వంతు కృషి చేశాను. ప్రజల ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారని నమ్మే నేను రాజకీయాల్లోకి మళ్లీ వచ్చాను. అంతేకాని ఏ పదవి ఆశించి రాలేదు. దీనిపై మీడియాలో వదంతులు ఆపండి’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.