ఎలక్ట్రికల్ బైక్ నడుపుతున్నారా..మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

|

Dec 13, 2019 | 2:23 PM

ఇట్స్ అఫిషియల్. మీరు 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ ఇ-స్కూటర్  డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం లోక్‌ సభలో ప్రకటన చేశారు.  16-18 సంవత్సరాల వయస్సు గల యువత..ఎంచక్కా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని, ఇ-స్కూటర్లను నడపుకోవచ్చు. కానీ కండీషన్స్ అప్లై అవుతాయి.    50 సిసి కంటే తక్కువ ఉన్న స్కూటర్లకు లైసెన్స్ మంజూరు చేస్తామంటూ ప్రకటించటించడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే 50 సిసి కన్నా తక్కవ కేటగిరీ స్కూటీలు […]

ఎలక్ట్రికల్ బైక్ నడుపుతున్నారా..మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!
Follow us on

ఇట్స్ అఫిషియల్. మీరు 16 ఏళ్ళ వయసులో ఉన్నప్పటికీ ఇ-స్కూటర్  డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం లోక్‌ సభలో ప్రకటన చేశారు.  16-18 సంవత్సరాల వయస్సు గల యువత..ఎంచక్కా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని, ఇ-స్కూటర్లను నడపుకోవచ్చు. కానీ కండీషన్స్ అప్లై అవుతాయి. 

  50 సిసి కంటే తక్కువ ఉన్న స్కూటర్లకు లైసెన్స్ మంజూరు చేస్తామంటూ ప్రకటించటించడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే 50 సిసి కన్నా తక్కవ కేటగిరీ స్కూటీలు అసలు మార్కెట్‌లో లేవు. కాలుష్య రహితమైన వాహనాలను ప్రమోట్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుంది.  ఈ విషయం పక్కనబెడితే తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ అధికారులకు దీనిపై పూర్తిగా అవగాహన లేకపోవడం గమనార్హం. 18 ఏళ్లు పైబడిన అప్లికేషన్స్ మాత్రమే తమకు వస్తాయని, ఒకవేళ అంతకంటే తక్కువ వయసు వారు అప్లై చేసినా..లైసెన్స్ మంజూరు చెయ్యమని ఆర్టీఏ అధికారులు పేర్కొన్నారు.