ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు

|

Oct 16, 2020 | 5:50 PM

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జలమండలి సంప్‌లు శుభ్రపర్చాలని నిర్ణయించారు. అంతేకాదు, జలమండలి ఉద్యోగులు కేటీఆర్ ఆదేశాలమేరకు హైదరాబాద్ లోని ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఇంటికి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటిలో కలపడానికి క్లోరిన్ మాత్రలను ఇస్తున్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇంటి నిల్వ సంపు.. వర్షపు నీటితో కలిసి ఉంటే, మీ సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని కూడా జలమండలి […]

ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు
Follow us on

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జలమండలి సంప్‌లు శుభ్రపర్చాలని నిర్ణయించారు. అంతేకాదు, జలమండలి ఉద్యోగులు కేటీఆర్ ఆదేశాలమేరకు హైదరాబాద్ లోని ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఇంటికి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటిలో కలపడానికి క్లోరిన్ మాత్రలను ఇస్తున్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇంటి నిల్వ సంపు.. వర్షపు నీటితో కలిసి ఉంటే, మీ సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచాలని కూడా జలమండలి హైదరాబాద్ ప్రజలకు ఒక ప్రకటన జారీ చేసింది. జలమండలి సరఫరా నీటితో సంపులు నింపుకుని ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి నీటిని వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇతర వివరాలకు జల మండలి కస్టమర్ కేర్ నెం. 155313 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు.