మందు తాగి బండి నడుపుతున్నారా… అదిరిపోయే షాకిచ్చిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..

|

Dec 27, 2020 | 8:26 PM

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేశారు పోలీసులు. ఇకపై ఎలా పడితే అలా బండి నడిపితే కదరదు. హైదరాబాద్‌ పోలీసులు కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను అమలులోకి తెచ్చారు. అంతే కాదు తాగి బండి నడిపితే చర్యలు..

మందు తాగి బండి నడుపుతున్నారా... అదిరిపోయే షాకిచ్చిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు..
Follow us on

Hyderabad Traffic Police : హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేశారు పోలీసులు. ఇకపై ఎలా పడితే అలా బండి నడిపితే కదరదు. హైదరాబాద్‌ పోలీసులు కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను అమలులోకి తెచ్చారు. అంతే కాదు తాగి బండి నడిపితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే వారి పనిచేసే ఆఫీసులకు సమాచారం అందిస్తామని వెల్లడించారు. మొదటి సారి పట్టుబడితే రూ.10వేలు ఫైన్‌, 6 నెలల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. రెండో సారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్‌, రెండేళ్ల జైలు శిక్ష, శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేస్తామని పోలీస్‌ శాఖ స్పష్టం చేసింది. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఒక్క డిసెంబర్‌ నెలలోనే 2,351 కేసులు నమోదయ్యాయని, రాచకొండ కమిషనరేట్‌లో ఈ ఏడాది 3,287 కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు.