చలాన్ల వసూలు పనిలో ట్రాఫిక్ పోలీసులు

|

Jun 20, 2020 | 3:20 PM

ఇంతకాలం ఉదాసీనంగా ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాత పద్దులను వసూలు చేసుకునే పనిలో పడ్డారు . పెండింగ్ చలాన్లను వెంటనే కట్టకపోతే వాహనాలను సీజ్ చేస్తున్నారు.

చలాన్ల వసూలు పనిలో ట్రాఫిక్ పోలీసులు
Follow us on

ఇంతకాలం ఉదాసీనంగా ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పాత పద్దులను వసూలు చేసుకునే పనిలో పడ్డారు . పెండింగ్ చలాన్లను వెంటనే కట్టకపోతే వాహనాలను సీజ్ చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో 21 లక్షల చలాన్లు విధించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వాటి విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటిని వెంటనే రికవరీ చేసి ఆదాయం పెంచుకోవాలని చూస్తున్నారు.
చలాన కట్టని వారి పని పట్టేందుకు రంగంలో దిగారు హైదరాబాద్ పోలీసులు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి ఇప్పటికే ఆన్ లైన్ లో చలాన మెసెజ్ పంపించిన పోలీసులు.. వెంటనే కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. అయిదు అంతకంటే ఎక్కువ చలాన్లు ఉన్న వాళ్లకి ఏకంగా నోటీసులే జారీ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. పెండింగ్ చలాన్లను అక్కడే కట్టించుకుంటున్నారు. చలాన కట్టని వెహికల్స్ ను వెంటనే సీజ్ చేసి పోలీసు స్టేషన్ కి తరలిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం వాహనం నడిపే వారికి కూడా రూల్స్ తప్పనిసరి చేసింది. ఇక టూవీలర్ వాహనానికి సైడ్ మిర్రర్స్, వెనక కూర్చున్న వారికి కూడా హెల్మెట్ ధరించాలని నిబంధనలు విధించారు. పెండింగ్ లో ఉన్న పద్దులు వసూలు చేసుకుని ఆదాయం పెంచుకునే పనిలో పడ్డారు ట్రాఫిక్ పోలీసులు.