Hyderabad Dubai Airlines: దుబాయ్ వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. భారత్-యూఏఈ మధ్య కుదిరిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ఒప్పందం ప్రకారం దుబాయ్‌కి విమాన సేవలు షూరూ అయ్యాయి. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లడానికి, తిరిగి రావడానికి ఎయిర్ ఎమిరెట్స్ అరేబియా విమాన సర్వీసులను ఉపయోగించుకొవచ్చునని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఆధికారులు తెలిపారు. షార్జా, హైదరాబాద్ జర్నీ చేయాలనుకునేవారు, ఎయిర్ అరేబియా సర్వీసులను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మంగళ, గురు, ఆదివారాల్లో, ఫ్లై దుబాయ్ ఎయిర్‌లైన్స్ సోమ, బుధ, శని వారాల్లో .. ఎయిర్ అరేబియా బుధ, శుక్ర, అదివారాల్లో సర్వీసులను నడిపించనున్నాయి. కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ మేరకు ఏ ప్రయాణికుడైనా హైదరాబాద్ నుంచి దుబాయ్, షార్జాలకు టికెట్ బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
Read More:
Bigg Boss 4: నోయల్‌కి సూచన.. కరాటే కళ్యాణిపై ఫైర్
మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర మంత్రి అమిత్ షా