దేశంలోని ఫార్మారంగంలో సింహభాగం తెలంగాణదే.. త్వరలోనే ఫార్మా సిటీ హబ్‌గా మారనున్న హైదరాబాద్..

|

Dec 09, 2020 | 4:31 PM

త్వరలోనే హైదరాబాద్ ఫార్మా సిటీ హబ్‌గా మారనుంది. జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు

దేశంలోని ఫార్మారంగంలో సింహభాగం తెలంగాణదే.. త్వరలోనే ఫార్మా సిటీ హబ్‌గా మారనున్న హైదరాబాద్..
Follow us on

త్వరలోనే హైదరాబాద్ ఫార్మా సిటీ హబ్‌గా మారనుంది. జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థలు హైదరాబాద్‌ను ‘వ్యాక్సిన్‌ హబ్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’గా మార్చేందుకు కృషి చేస్తున్నాయి. బయోసైన్సెన్‌ నుంచి ఐటీ వరకు తెలంగాణను అడ్డాగా చేస్తున్నాయి. ప్రపంచానికి అతి ముఖ్యమైన టీకాలను అందిస్తున్న కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. భారత్‌ బయోటెక్‌, బయోలాజికల్‌-ఈ, ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌, శాంతా బయోటెక్‌ వంటి సంస్థలు వ్యాక్సిన్ల తయారీకి పరిశోధనలు చేపడుతున్నాయి.

కొవిడ్ వ్యాక్సిన్ తయారీలో తెలంగాణ నుంచే 33% శాతం ఇతర దేశాలకు ఎగుమతి కానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన తొలిదైన కొవాగ్జిన్‌ హైదరాబాద్‌ నుంచే రావటం విశేషం. ఔషద తయారీ పరంగా ప్రపంచంలో మనదేశం 3వ స్థానంలో ఉంది. ప్రపంచమార్కెట్‌ పరంగా 3.5 శాతంతో 14 స్థానంలో భాగ్యనగరం నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఫార్మా విస్తరణకు పీఎల్‌ఐ( ప్రొడక్ట్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌) స్కీమ్‌, బల్క్‌ డ్రగ్‌ క్లస్టర్‌ స్కీమ్‌ అనే రెండు రాయితీ పథకాలను ప్రవేశపెడుతోంది. 6 ఏళ్లు అమలయ్యే ఈ విధానంలో ముడిపదార్థాల తయారీకి రూ.6,940 కోట్లు కేటాయించనుంది. దేశంలోని ఫార్మారంగంలో సింహభాగం తెలంగాణదే. అనుబంధ కంపెనీలతో సహా మొత్తం 800 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. దేశ ఎగుమతుల్లో తెలంగాణ వాటా సుమారు 40 శాతం ఉంటుంది. దీని మార్కెట్‌ విలువ 50వేల అమెరికన్‌ డాలర్లుగా చెప్పవచ్చు. ప్రభుత్వాల ప్రోత్సహాకాలు లేక పూర్తిగా చైనా దిగుమతులపై ఆధార పడటం వల్ల దేశీ ముడిపధార్థాల తయారీ కుంటుపడుతోంది.

అయితే తెలంగాణ సర్కారు వచ్చాక 20వేల ఎకరాల్లో ఆధునిక ఇంటిగ్రేటెడ్‌ ఫార్మా ఇండిస్ట్రియల్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తానని ప్రకటించింది. రూ1లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి సిద్దమైంది. దీంతో మార్కెట్‌ విలువలో స్థానిక ఔషధ సంస్థలు పోటీ పడుతున్నాయి. స్థానిక అగ్రగామి ఔషధ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో చోటు సంపాదించింది. త్వరలో దివీస్‌ లేబొరేటరీస్‌ నిఫ్టీలోకి వెళ్లనుంది. అరబిందో ఫార్మా గతంలో సూచీల్లోకి వెళ్లినప్పటికీ మార్కెట్‌ విలువ తగ్గటంతో బయటకు వచ్చింది. ఈ కంపెనీలు ఒక్కొక్కటీ రూ.50,000 కోట్ల మార్కెట్‌ విలువను కలిగి ఉన్నాయి. పారాసెటమాల్‌ నుంచి యాంటీ-వైరల్‌, యాంటీ-రిట్రోవైరల్‌ ఔషధాలు తయారు చేసే కంపెనీలకు డిమాండ్ పెరిగింది. కొవిడ్‌-19 ఔషధంగా వాడుకలోకి వచ్చిన ‘ఫావిపిరవిర్‌’ తయారీలో ఇక్కడి ఫార్మా కంపెనీలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో లైఫ్‌సైన్సెస్‌ రంగం వాటా 10 శాతానికి చేరుకున్నది. 2016లో తెలంగాణ జీఎస్డీపీ 88.2 బిలియన్‌ డాలర్లు కాగా.. 2020 నాటికి అది 136.28 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నది.