వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి అమల్లోకి.. సిటిజన్ ట్రాకింగ్ యాప్

| Edited By:

Apr 11, 2020 | 7:46 PM

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ తెలంగాణలో పోలీసులు... లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమించేవారిని పోనీలే అని వదిలేశారు.

వాహనదారులకు అలర్ట్.. నేటి నుంచి అమల్లోకి.. సిటిజన్ ట్రాకింగ్ యాప్
Follow us on

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఇప్పటివరకూ తెలంగాణలో పోలీసులు… లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమించేవారిని పోనీలే అని వదిలేశారు. ఇకపై అలా జరగదు. యాక్షన్ తప్పదు అంటున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ యాప్‌ సిద్ధమైంది. అదే సిటిజన్ ట్రాకింగ్ కొవిడ్-19 యాప్. ఇకపై రూల్స్‌కి వ్యతిరేకంగా ఎవరైనా బైకులు, కార్లపై 3 కిలోమీటర్లకు మించి తిరిగితే… వెంటనే సిటిజన్ ట్రాకింగ్ కొవిడ్-19 యాప్‌లో కేసు నమోదు చేస్తారు.

కాగా.. ఈ రోజు నుంచి ఈ యాప్ అమల్లోకి వస్తోంది. ఈ యాప్‌లో సదరు బండి ఎంత దూరం వెళ్లింది. ఎన్ని కిలోమీటర్లు అదనంగా వెళ్లింది అనేది ఎప్పటికప్పుడు నమోదుచేస్తారు. అందువల్ల… ఎవరైనా పోలీసులకు చిక్కి.. ఇదే మొదటిసారి… ఈసారి వదిలేయండి అంటే పోలీసులు నమ్మరు. యాప్‌లో చెక్ చేసి మరీ యాక్షన్ తీసుకుంటారు. కేసులు రాస్తారు. తెలంగాణలోని పోలీస్ అధికారులు, ఇప్పుడు పోలీసులు అందరి దగ్గరా ఈ యాప్ ఉంది.

కరోనా కట్టడి నేపథ్యంలో.. తెలంగాణాలో ఇకపై ఎవరైనా రోడ్లపై వాహనాలతో ఎంటరైతే… సిటిజన్ ట్రాకింగ్ యాప్‌లో ఆ వాహనం నంబర్ ఎంటర్ చేస్తారు. తద్వారా అది మొత్తం వివరాలు బయటపెడుతుంది. ఈ విషయం తెలియని బండి వ్యక్తి… అలా జాయ్‌గా బండి నడుపుకుంటూ… ముందుకు వెళ్తారు. అలా ఆ బండి వెళ్తున్న చోట్ల… వేర్వేరు ప్రాంతాల్లో దాని నంబర్‌ ఎంటరవుతూ ఉంటుంది. తద్వారా ఆ బండి ఆ రోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్లిందే లెక్క తేల్చేస్తుంది. అది 3 కిలోమీటర్లు దాటిందంటే చాలు… కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత వాహనాన్ని సీజ్ చేస్తారు.

మరోవైపు.. మీకు ఏ సామాన్లు కావాల్సి వచ్చినా… మీకు 3 కిలోమీటర్ల లోపు ఉన్న షాపుల్లోనే కొనుక్కోవాలి. మీరు కోరుకున్న సామాను దొరకకపోతే… దాని బదులు మరో సామాను కొనుక్కోవాలే తప్ప… అదే కావాలని పట్టుపట్టకూడదు. మందుల విషయంలో మాత్రం కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ మందు 3 కిలోమీటర్ల పరిధిలో దొరకకపోతే, అప్పుడు పోలీసులకు విషయం చెప్పి… వారి అనుమతితో చుట్టుపక్కల వేరే మెడికల్ షాపులకు వెళ్లొచ్చు. ఇదంతా ప్రజల మంచి కోసమే అంటున్న పోలీసులు దయచేసి ఈ రూల్స్ కచ్చితంగా పాటించాలని మరీ మరీ కోరుతున్నారు.