కొత్త తరహా మోసం, హైదరాబాదీలూ తస్మాత్ జాగ్రత్త !

|

Sep 14, 2020 | 1:15 PM

ఇష్యూ ఏదైనా మోసం కామన్ అయిపోయింది. అందునా, ఇందునా అని కాదు, ఎందెందు వెతికినా చివరికి మోసమే దర్శనమిస్తుంది.

కొత్త తరహా మోసం, హైదరాబాదీలూ తస్మాత్ జాగ్రత్త !
Follow us on

ఇష్యూ ఏదైనా మోసం కామన్ అయిపోయింది. అందునా, ఇందునా అని కాదు, ఎందెందు వెతికినా చివరికి మోసమే దర్శనమిస్తుంది. తాజాగా స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్ మెంట్స్ పేరుతో ప్రజలను చీట్ చేస్తున్న 9 మంది సైబర్‌ కేటుగాళ్లను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్టాక్‌మార్కెట్‌లో రూ. 30 వేలు ఇన్వెస్ట్ చేస్తే,  5 నెలల్లో 10 రెట్లు అయ్యేలా చేస్తామంటూ ఆశజూపి ఈ కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ‘టాప్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌’ పేరిట కంపెనీ ప్రారంభించి అమాయకుల నుంచి భారీగా డబ్బు దోచుకుంటున్నట్లు హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది.

నగరంలోని వనస్థలిపురానికి చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి నుంచి నిందితులు భారీగా డబ్బు కాజేశారు. ఆయన్ను మోసం చేసి రూ.9.6 లక్షల డబ్బును సైబర్‌ నేరగాళ్లు దోచుకున్నారు. నిందితులను హైదరాబాద్‌ పోలీసులు మధ్యప్రదేశ్‌లోని సాగర్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పీటీ వారంట్‌పై వారిని హైదరాబాద్ తీసుకొచ్చారు.

Also Read :

అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి కరోనా పాజిటివ్

విషాదం : చిన్నారి ప్రాణం తీసిన బిస్కెట్