హైదరాబాద్ మెట్రోకు అరుదైన ఘనత…

|

Feb 08, 2020 | 4:18 PM

శుక్రవారం మరో 11 కిలోమీటర్ల విస్తరణతో హైదరాబాద్ మెట్రో రైలు ఢిల్లీ తరువాత దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌గా అవతరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతూ జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్) వరకు గ్రీన్ లైన్ సాగిన మెట్రో రైలును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫ్రారంబించారు. ఈ విస్తీర్ణంలో మెట్రో సర్వీసు తెరవడం వల్ల తెలంగాణలోని రెండు అతిపెద్ద  ఆర్టీసీ బస్ […]

హైదరాబాద్ మెట్రోకు అరుదైన ఘనత...
Follow us on

శుక్రవారం మరో 11 కిలోమీటర్ల విస్తరణతో హైదరాబాద్ మెట్రో రైలు ఢిల్లీ తరువాత దేశంలో రెండవ అతిపెద్ద మెట్రో రైలు నెట్‌వర్క్‌గా అవతరించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలుపుతూ జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్) వరకు గ్రీన్ లైన్ సాగిన మెట్రో రైలును తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫ్రారంబించారు. ఈ విస్తీర్ణంలో మెట్రో సర్వీసు తెరవడం వల్ల తెలంగాణలోని రెండు అతిపెద్ద  ఆర్టీసీ బస్ స్టేషన్ల మధ్య ప్రయాణికుల తరలింపు సులభతరం అవుతుంది. ఇది పరేడ్ గ్రౌండ్స్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్లు, సుల్తాన్ బజార్ వంటి అనేక ముఖ్యమైన ప్రదేశాల గుండా వెళుతుంది.

ప్రపంచంలోని అతిపెద్ద ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టు అయిన హైదరాబాద్ మెట్రో రైల్ ఇప్పుడు దేశంలో రెండవ అతిపెద్ద కార్యాచరణ మెట్రో నెట్‌వర్క్ 69.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవం తరువాత, ముఖ్యమంత్రి తన క్యాబినెట్ సహచరులు, ఉన్నతాధికారులతో కలిసి జెబిఎస్ నుండి చిక్కడ్‌పల్లి వరకు ప్రయాణించారు. ఇక మూసి నదిపై ఎంజిబిఎస్ నుండి పాత నగరంలోని ప్రసిద్ధ  ఫలక్నుమా ప్యాలెస్ వరకు మెట్రో సర్వీసు పరిధిని విస్తరించే పనులు ఇంకా ప్రారంభం కాలేదు. తొమ్మిది మెట్రో స్టేషన్లను కలిగి ఉన్న ఈ స్ట్రెచ్, ప్రయాణ సమయాన్ని ఒక చివర నుండి మరొక చివర వరకు కేవలం 16 నిమిషాలకు తగ్గిస్తుందని అధికారులు చెప్తున్నారు.

2017 నవంబర్ 28 న ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో మొదటి విభాగం మియాపూర్-అమీర్‌పేట-నాగోల్‌ను ప్రారంభించారు. 2018 లో, రెండవ విభాగం అమీర్‌పేట్-ఎల్.బి. నగర్‌ సర్వీస్ స్టార్ట్ చేశారు. మూడవ విభాగం అమీర్‌పేట్-హిటెక్ సిటీ (10 కి.మీ) 2019 మార్చి 20 న ప్రారంభించబడింది. హైటెక్ సిటీ నుండి రాయదుర్గ్ వరకు మరో 1.5 కిలోమీటర్ల విస్తీర్ణం గల సర్వీస్‌ను గత ఏడాది నవంబర్‌లో ప్రేవశపెట్టారు. హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజూ 780 ట్రిప్పులతో నాలుగు లక్షలకు పైగా ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఎంజిబిఎస్-ఫలక్నుమాను మినహాయించి, మొత్తం ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయింది.