వాతావరణ సూచన… మరో రెండు రోజులు వర్షాలు..

|

Sep 06, 2020 | 4:18 PM

తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొంది...

వాతావరణ సూచన... మరో రెండు రోజులు వర్షాలు..
Follow us on

తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజుల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అక్క‌డ‌క్క‌డ ఉరుములు, మెరుపుల‌తో కూడిన మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్‌ పలు చోట్ల వాతావరణం మార్పు ఉంటుందని వెల్లడించింది.

ఇక గ‌త నాలుగైదు రోజుల నుంచి తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ప‌గ‌టి స‌మ‌యాల్లో ఉష్ణోగ్ర‌త‌లు అధికంగా న‌మోదు అవుతున్నాయి. భాను ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా అధికంగా ఉంది. మార్చు, ఏప్రిల్ నెలల్లో ఉండే  ఉష్ణోగ్రతలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావడానికి భయపడుతున్నారు.  ఉక్క‌పోత‌తో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో వ‌ర్షాలు కురిస్తే ప్ర‌జ‌ల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం క‌ల‌గ‌నుంది. కొంత తేలికపాటి వర్షాలు పడితే వాతావరణంలో కొంత తేమ శాతం పెరిగిే అవకాశం ఉంది.

ఇదిలా వుంటే రాష్ట్రంలోని ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. గ్రామాల్లోని గొలుసుకట్టు చెరువులు మత్తడి దూకుతున్నాయి. చెరువుల్లో సరిపడే నీటి వసతి ఉండటంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది.