ఆర్టికల్ 370 రద్దు: స్వీట్లు పంచుకున్న న్యాయవాదులు

| Edited By:

Aug 05, 2019 | 3:00 PM

ఆర్టికల్ 370 , 35(ఏ)లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఆ రెండు కీలక ఆర్టికల్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ మల్కాజిగిరి కోర్టులో న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుని భారతమాతాకీ జై అంటూ వారు నినాదాలు చేశారు.అటు రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని […]

ఆర్టికల్ 370 రద్దు: స్వీట్లు పంచుకున్న న్యాయవాదులు
Follow us on

ఆర్టికల్ 370 , 35(ఏ)లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఆ రెండు కీలక ఆర్టికల్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కేంద్రప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ మల్కాజిగిరి కోర్టులో న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుని భారతమాతాకీ జై అంటూ వారు నినాదాలు చేశారు.అటు రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకున్నారు.

జమ్ము కశ్మీర్‌కు సబంధించి అమల్లో ఉన్న ఆర్టికల్ 370తో పాటు 35(ఏ)ను కూడా రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటన చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. గతంలో జరిగిన ఒక చారిత్రిక తప్పిదాన్ని తమ ప్రభుత్వం సరిదిద్దినట్లుగా బీజేపీ నేతలు చెబుతుంటే .. దేశ చరిత్రలో ఇదొక చీకటిరోజుగా ప్రతిపక్షపార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.