జనతా కర్ఫ్యూపై.. హైదరాబాద్ సీపీ ఆసక్తికర వ్యాఖ్యలు..!

| Edited By:

Mar 22, 2020 | 3:33 PM

కోవిద్ 19 పై జరుగుతున్న సమరంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌లో అమలవుతున్న జనతా కర్ఫ్యూపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో 99 శాతం ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారని, ఈ పరిణామం ఎంతో సంతోషకరమని చెప్పారు.

జనతా కర్ఫ్యూపై.. హైదరాబాద్ సీపీ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Follow us on

కోవిద్ 19 పై జరుగుతున్న సమరంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌లో అమలవుతున్న జనతా కర్ఫ్యూపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో 99 శాతం ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారని, ఈ పరిణామం ఎంతో సంతోషకరమని చెప్పారు. ప్రధాని పిలుపు మేరకు స్వచ్ఛంగా ఇంట్లోనే ఉండిపోవాలనే అవగాహన ప్రజల్లో కలగడం గొప్ప విషయమని కొనియాడారు. అసలు జనతా కర్ఫ్యూ దేశంలో ఇలా అమలు కావడం దేశ చరిత్రలోనే తొలిసారి అని కితాబిచ్చారు. జనతా కర్ఫ్యూ పరిస్థితులను పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్ ఆదివారం మధ్యాహ్నం అసెంబ్లీ ఎదుట మీడియాతో మాట్లాడారు. ఇళ్లలోనే ఉండి సహకరిస్తున్న ప్రజలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 24 గంటల పాటు కర్ఫ్యూ జరుగుతోందని చెప్పారు. ప్రధాన రహదారుల్లో పోలీసులు, శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారులు ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని అన్నారు. ప్రజల్లో ఇదే ఉత్సాహం ఎప్పటికీ కొనసాగాలని పిలుపునిచ్చారు. ‘‘దేశంలో మహమ్మారి వైరస్‌ను పారదోలేలా గట్టి పోరాటం జరుగుతోంది. కచ్చితంగా ఈ పోరాటంలో మనం గెలుస్తాం. వైరస్‌ను రూపుమాపుతాం. ప్రజలంతా సామాజిక వ్యత్యాసం ద్వారా వైరస్ ప్రబలే అవకాశాన్ని దాదాపు అణచివేయవచ్చని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలను పాటించాలని సూచించారు.