హైదరాబాద్ బిర్యానీ.. ‘హిందుస్తాన్ కా షేర్’: కేటీఆర్

|

Feb 06, 2020 | 8:05 PM

Hyderabad Biryani Best In The World: హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. ఘుమఘమలాడే నోరూరించే ఆ బిర్యానీ అంటేనే ఎంతోమంది మక్కువ చూపిస్తారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా లొట్టలేసుకుంటూ తింటారు. ఆఖరికి దేశవ్యాప్తంగా బిర్యానీకి భాగ్యనగరం ఫేమస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బిర్యానీని పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇక అది కాస్తా సోషల్ మీడియాలో […]

హైదరాబాద్ బిర్యానీ.. హిందుస్తాన్ కా షేర్: కేటీఆర్
Follow us on

Hyderabad Biryani Best In The World: హైదరాబాద్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీ. ఘుమఘమలాడే నోరూరించే ఆ బిర్యానీ అంటేనే ఎంతోమంది మక్కువ చూపిస్తారు. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా లొట్టలేసుకుంటూ తింటారు. ఆఖరికి దేశవ్యాప్తంగా బిర్యానీకి భాగ్యనగరం ఫేమస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బిర్యానీని పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు. ఇక అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ హైదరాబాద్ బిర్యానీని కాదని.. పారిస్‌కు చెందిన ‘తలసేరి ఫిష్ బిర్యానీ’ అద్భుతంగా ఉంటుందని ఓటేశారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్.. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ బిర్యానీ హక్కులన్నీ కూడా హైదరాబాద్‌కు చెందినవే అమితాబ్ జీ. నేను ఖచ్చితంగా చెబుతున్నా.. హైదరాబాద్ బిర్యానీతో పోలిస్తే మిగిలినవి అన్ని వట్టి అనుకరణలే. అంతేకాక ఇటీవల యునెస్కో కూడా మా ఆహార సంస్కృతీని గుర్తించి ఓ బిరుదు కూడా ఇచ్చిందని’ కేటీఆర్ నీతి ఆయోగ్ సీఈఓకు కౌంటర్ ఇచ్చారు.