కరోనా లాక్‌డౌన్: ప్రజలకే కాదు.. పశుపక్ష్యాదులకు కూడా కష్టాలే..

| Edited By:

Jun 29, 2020 | 4:23 AM

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. థాయ్‌లాండ్‌లోని లోప్‌బురిలో సాన ఫ్రా కాన, ఫ్రా ప్రాంగ్‌ సామ్‌ అనే పురాతన ఆలయాల ప్రాంగణంలో వేల కోతులు

కరోనా లాక్‌డౌన్: ప్రజలకే కాదు.. పశుపక్ష్యాదులకు కూడా కష్టాలే..
Follow us on

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. థాయ్‌లాండ్‌లోని లోప్‌బురిలో సాన ఫ్రా కాన, ఫ్రా ప్రాంగ్‌ సామ్‌ అనే పురాతన ఆలయాల ప్రాంగణంలో వేల కోతులు సందడి చేస్తుంటాయి. ఇక్కడి కోతులకు ఆహారం అందిస్తే సకల శుభాలు, ఐశ్వర్యం సిద్దిస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. అంతేకాకుండా ప్రతీ ఏడాది ‘మంకీ బఫెట్‌ ఫెస్టివల్‌’అనే వినూత్న వేడుకను ఏర్పాటు చేసి అక్కడి కోతులకు పెద్ద మొత్తంలో ఆహారాన్ని అందిస్తారు. అయితే లాక్‌డౌన్‌తో సీన్‌ రివర్సయింది.

వివరాల్లోకెళితే.. కోవిద్-19 కారణంగా థాయ్‌లాండ్‌ టూరిజం దెబ్బతింది. ఈ వైరస్ దెబ్బకు పర్యాటక రంగం భారీగా నష్టపోయింది. దీంతో లోప్‌బురిలో నివసించే వేల కోతుల కష్టాలు వర్ణనాతీతం. పర్యాటకులు లేకపోవడంతో వీటికి ఆహార కొరత ఏర్పడింది. దీంతో రోడ్లపైకి వచ్చి ఆహారం కోసం వెతుకులాట ప్రారంభించాయి. అక్కడి ప్రజలపై, దుకాణాదారులపై ఆహారం కోసం దాడి చేస్తున్నాయి. కొంత మంది వీటి దయనీయ పరిస్థితిని గమనించి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కోతుల దయనీయ పరిస్థితి అద్దం పట్టే ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

Also Read: కరోనా కేర్ సెంటర్‌గా.. కోరమంగళ ఇండోర్ స్టేడియం..