నూతన సంవత్సర వేడుకల్లో వేలాది పక్షుల బలి . రోమ్ లో ఫైర్ వర్క్స్ ‘హంగామా; ప్రజల ఉత్సాహం , మూగజీవాల మృతి

| Edited By: Pardhasaradhi Peri

Jan 02, 2021 | 2:02 PM

రోమ్ లో ప్రజలు జరుపుకున్న  నూతన సంవత్సర వేడుకలు పక్షుల పాలిట యమపాశాలుగా మారాయి. ఉత్సాహంగా వీరు బాణాసంచా కాల్చడంతో ఆ మంటల

నూతన సంవత్సర వేడుకల్లో  వేలాది పక్షుల బలి . రోమ్ లో ఫైర్ వర్క్స్ హంగామా;  ప్రజల ఉత్సాహం  , మూగజీవాల మృతి
Follow us on

New Year Celebrations:రోమ్ లో ప్రజలు జరుపుకున్న  నూతన సంవత్సర వేడుకలు పక్షుల పాలిట యమపాశాలుగా మారాయి. ఉత్సాహంగా వీరు బాణాసంచా కాల్చడంతో ఆ మంటల, వేడికి  వేలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. ఫైర్ క్రాకర్ల శబ్దాలకు భయపడి కొన్ని, విద్యుత్ పవర్ లైన్లమీద పడి మరికొన్ని ఇలా పెద్ద సంఖ్యలో ఇవి మృతి చెందినట్టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఎనిమల్స్ వెల్లడించింది. ప్రతి ఏడాదీ ఈ విధంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సమయంలో పక్షులు, మూగజీవాలు మృత్యువాత పడుతుంటాయని ఈ సంస్థ పేర్కొంది. ఇంకా అనేక జంతువులు గాయపడడం కూడా జరుగుతోందని ఈ సంస్థ తెలిపింది.  వ్యక్తిగత వినియోగానికి బాణాసంచా అమ్మకాలను నిషేదించాలని  ఈ సంస్థ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. మరికొన్ని దేశాల్లో కూడా నూతన సంవత్సర వేడుకలు జంతువుల పాలిట హానికరంగా మారింది.

Read More:

Corona Vaccine Dry Run Live Updates : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రై రన్.. తెలుగు రాష్ట్రాల్లో కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌..

Buta Singh Died : కాంగ్రెస్ పార్టీలో విషాదం..కేంద్ర మాజీ హోం మంత్రి భూటా సింగ్​ కన్నుమూత