Murder in Kashmir: కశ్మీరులో ఉగ్రవాదుల ఘాతుకం.. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందినందుకు..

Murder in Kashmir: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దాడికి పాల్పడ్డారు. స్థానికేతరులను బెదిరించాలనే ఉద్ధేశ్యంతో ఓ స్థానికేతరుడిని

Murder in Kashmir: కశ్మీరులో ఉగ్రవాదుల ఘాతుకం.. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందినందుకు..
Follow us

|

Updated on: Jan 02, 2021 | 12:12 PM

Murder in Kashmir: కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దాడికి పాల్పడ్డారు. స్థానికేతరులను బెదిరించాలనే ఉద్ధేశ్యంతో ఓ స్థానికేతరుడిని కిరాతకంగా చంపేశారు. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన అందరిని భయకంపితులను చేస్తోంది. 370 రద్దు తర్వాత జమ్మూ-కశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే.

దీంతో అక్కడి స్థిరాస్తులను స్థానికేతరులు సైతం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇప్పటి వరకు 10 లక్షల మంది స్థానికేతరులు స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందినట్లు అధికారికంగా లెక్కలు చెబుతున్నాయి. వీరిలో చాలా మంది అనేక సంవత్సరాల క్రితం అక్కడికి వెళ్లి నివాసముంటున్నవారే ఉన్నారు. అయితే సత్‌పాల్‌ నిశ్చల్‌‌ అనే నగల వ్యాపారి కశ్మీర్‌లో 50 ఏళ్లుగా నివాసముంటున్నారు. శ్రీనగర్‌లోని ఓ మార్కెట్‌కు వెళ్లిన ఆయనపై ముష్కరులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. రెసిస్టంట్‌ ఫ్రంట్‌ అనే ఉగ్రముఠా ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం పొందే ఎవరినైనా ఇలాగే చంపేస్తామని బెదిరిస్తోంది.