గోవాలో ‘కోవ్యాక్సిన్’ హ్యుమన్ ట్రయల్స్ షురూ..

| Edited By:

Jul 21, 2020 | 12:04 AM

కోవిద్-19 విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ గోవాలోని రెడ్కర్ హాస్పిటల్‌లో మొదలైనట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు.

గోవాలో కోవ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ షురూ..
Follow us on

Human trials of Covaxin has begun: కోవిద్-19 విజృంభిస్తోంది. దేశంలో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్ గోవాలోని రెడ్కర్ హాస్పిటల్‌లో మొదలైనట్లు గోవా సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఈ సందర్భంగా.. కోవ్యాక్సిన్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించిన ఆయన.. కోవ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కోవ్యాక్సిన్‌ తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జూలై 15న ప్రారంభమైనట్టు.. దాన్ని అభివృద్ధి చేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రకటించింది.

ప్రస్తుతం దేశంలో 7 వ్యాక్సిన్లు ప్రయోగాల దశలో ఉండగా.. వాటిలో జైడస్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థల వ్యాక్సిన్లకు మనుషులపై ప్రయోగాలకు ఆమోదం లభించిన సంగతి విదితమే. హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్‌ విజ్ “రోహ్‌తక్ లో ఉన్న పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్ (పీజీఐ)లో కోవ్యాక్సిన్‌ ప్రయోగాలు సత్ఫలితాలనిస్తున్నాయని” ట్విటర్‌లో వెల్లడించారు.

[svt-event date=”20/07/2020,11:31PM” class=”svt-cd-green” ]