తుంగభద్ర డ్యామ్‌కు భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత!

| Edited By:

Aug 17, 2020 | 1:07 PM

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. టీబీ డ్యామ్ ఎగువన ఉన్న షిమోగా (శివమొగ్గ) జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో...పెద్ద ఎత్తున వరద వచ్చే ప్రమాదం ఉందని టీబీ డ్యామ్ అధికారులను

తుంగభద్ర డ్యామ్‌కు భారీ వరద.. 10 గేట్లు ఎత్తివేత!
Follow us on

Huge Inflow To Tungabhadra: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర డ్యామ్ ఎగువన ఉన్న షిమోగా (శివమొగ్గ) జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో…పెద్ద ఎత్తున వరద వచ్చే ప్రమాదం ఉందని డ్యామ్ అధికారులను సీడబ్ల్యూసీ టీబీ (కేంద్ర జలవనరుల కమిటీ) హెచ్చరించింది. తుంగభద్ర డ్యామ్‌కు 40 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో… ఔట్ ఫ్లో 25 వేల క్యూసెక్కులుగా ఉంది. అధికారులు డ్యామ్ 10 గేట్లు ఎత్తి వేసి తుంగభద్రా నదిలోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం నీటి నిల్వ 98.5 టీఎంసీలకు చేరింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Read More:

ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు.. 16 సెంటీమీటర్లకు పైగా..!

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!