సంక్రాంతి నేపథ్యంలో.. జంటనగరాల్లో రికార్డు స్థాయిలో చికెన్‌ విక్రయాలు!

| Edited By: Pardhasaradhi Peri

Jan 05, 2021 | 6:29 PM

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. జంటనగరాల్లో భారీగా చికెన్‌ వినియెగం జరిగింది. సంక్రాంతి, కనుమ రెండు రోజుల పండగ కోసం రాజధానిలో..

సంక్రాంతి నేపథ్యంలో.. జంటనగరాల్లో రికార్డు స్థాయిలో చికెన్‌ విక్రయాలు!
Follow us on

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చికెన్‌కు డిమాండ్ పెరిగింది. జంటనగరాల్లో భారీగా చికెన్‌ వినియెగం జరిగింది. సంక్రాంతి, కనుమ రెండు రోజుల పండగ కోసం రాజధానిలో భారీగా చికెన్‌ అమ్మకాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి చికెన్‌ ధర కూడా తక్కువగానే ఉంది. గత సంవత్సరం సంక్రాంతి రోజున కిలో చికెన్‌ 260 రూపాయలు పలికింది. ఈసారి కిలో చికెన్‌ ధర 180 రూపాయలుగా ఉంది. దీంతో కొనుగోలు దారులు భారీగానే చికెన్‌ కొన్నారు. అయితే సంక్రాంతి, కనుమ కలిపి రెండు రోజుల్లో జంటనగరాల్లో 20లక్షల కోళ్ల అమ్మకాలు జరిగినట్టు వ్యాపారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 30శాతం అధికమని అన్నారు. సాధారణ రోజుల్లో అయితే రోజుకు 6లక్షల కోళ్ల వినియోగం జరిగితే ఈసారి మాత్రం సంక్రాంతి, కనుమ పండుగలకు రోజుకు 10లక్షల కోళ్ల వినియోగం జరిగినట్టు సమాచారం.