బ్రేకింగ్: విశాఖ వాసులను మరోసారి వణికించిన పొగలు..!

|

May 21, 2020 | 5:44 PM

విశాఖపట్నం మరోసారి దట్టమైన పొగలతో ఉలిక్కిపడింది. ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే.. మరో కంపెనీ నుంచి పొగలు చిమ్ముతుండడంతో కలకలం రేపింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో విశాఖవాసులు భయాందోళనలకు గురయ్యారు. విశాఖపట్నంలోని హిందూస్టాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో సీడీయూ-3ని తెరిచే క్రమంలో గాలిలోకి దట్టమైన పొగలు వెలువడ్డాయి. బాయిలర్ నుంచి గోధుమ రంగు పొగలు దట్టంగా గాలిలోకి […]

బ్రేకింగ్: విశాఖ వాసులను మరోసారి వణికించిన పొగలు..!
Follow us on

విశాఖపట్నం మరోసారి దట్టమైన పొగలతో ఉలిక్కిపడింది. ఎల్జీ పాలీమర్స్ గ్యాస్ లీక్ ఘటన మరువక ముందే.. మరో కంపెనీ నుంచి పొగలు చిమ్ముతుండడంతో కలకలం రేపింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో విశాఖవాసులు భయాందోళనలకు గురయ్యారు.

విశాఖపట్నంలోని హిందూస్టాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌) రిఫైనరీ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో తీవ్ర కలకలం రేగింది. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో సీడీయూ-3ని తెరిచే క్రమంలో గాలిలోకి దట్టమైన పొగలు వెలువడ్డాయి. బాయిలర్ నుంచి గోధుమ రంగు పొగలు దట్టంగా గాలిలోకి వ్యాపించడంతో విశాఖ నగర వాసులు ఆందోళనకు గురయ్యారు. అయితే కొంతసేపటికి పొగలు రావడం ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇది రోజువారి కార్యక్రమాల్లో భాగంగానే ఈ పొగలు వెలువడ్డట్టు అధి​కారులు వెల్లడించారు. దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఫ్లూయిడ్ క్యాటలిక్ క్రాకింగ్ సమయంలో దట్టమైన‌ పొగలు వస్తాయని తెలిపారు.