Easy Tomato Pickle: ఈజీగా టేస్టీగా అరగంటలో తయారు చేసుకునే టమాటా పికిల్ రెసిపీ.. ఒక నెల వరకూ నిల్వ

|

Jul 02, 2021 | 6:43 PM

Tomato Pickle: కొంతమందికి ఎన్ని కూరలు ఉన్నా అన్నం తినడానికి పచ్చడి వైపు చూస్తారు. అయితే నిల్వ పచ్చడిని కొంతమంది ఇష్టపడితే.. మరికొందరు అప్పటికప్పుడు చేసే పచ్చడిలను ఇష్టపడతారు..

Easy Tomato Pickle: ఈజీగా టేస్టీగా అరగంటలో తయారు చేసుకునే టమాటా పికిల్ రెసిపీ.. ఒక నెల వరకూ నిల్వ
Easy Tomato Pickle
Follow us on

Easy Tomato Pickle: కొంతమందికి ఎన్ని కూరలు ఉన్నా అన్నం తినడానికి పచ్చడి వైపు చూస్తారు. అయితే నిల్వ పచ్చడిని కొంతమంది ఇష్టపడితే.. మరికొందరు అప్పటికప్పుడు చేసే పచ్చడిలను ఇష్టపడతారు. ఈరోజు ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే టమాటా పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం..

కావలసిన వస్తువులు :

మంచి దేశవాళీ టోమేటోలు పెద్దవి ఎర్రటివి :
కారం
చింతపండు
పసుపు
ఉప్పు
నూనె
ఆవాపొడి ,
మెంతి పొడి

పచ్చడి పోపుపుకు కావాల్సిన పదార్ధాలు:

కర్వేపాకు
ఆవాలు
ఇంగువ వెల్లుల్లి
ఎండుమిర్చి

తయారీ విధానం: ముందుగా టమాటాలను ముక్కలుగా తరుక్కోవాలి . తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి నూనెవేసి వేడి ఎక్కిన తర్వాత టమేటో ముక్కలు వేసి వేయించాలి. తర్వాత టమాటా గుజ్జులోనే చింతపండు కొంచెం పసుపు ఉప్పు వేసి అన్ని కలిపి వేగా నివ్వలి బాగా నీరు లేకుండా వేగాక కొంచెం చల్లారినివ్వాలి. అనంతరం టమాటా గుజ్జులో రుచికి సరిపడా కారం , ఆవాపొడి , మెంతి పొడి వేసి కలిపి బాగా చల్లారాక అన్ని కలిపి మెత్తగా రుబ్బాలి. (మిక్సీ కంటే రోట్లో రుబ్బుకుంటే టేస్టీగా ఉంటుంది)

మళ్ళీ స్టవ్ మీద మూకుట్లో పోపు వేసి వేగాక ఇంగువ లేక వెల్లుల్లి కూడా వేసి వేయించి అప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి .పోపు ను చల్లారనివ్వాలి. అంతే టమాటా పచ్చడి రెడీ.. రుచి చూసి ఉప్పు తక్కువైతే కలిపి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఈ టమాటా పచ్చడి ఇడ్లి, దోస , ఉప్మా, అన్నంలోకే కాదు.. బ్రెడ్డు కి ,చపాతికి కొంచెం రాసుకుని రోల్ చేసుకుని తినెయ్యవచ్చు .

Also Read: