మీకు సొంతిల్లు లేదా.. ఉగాది వరకు ఆగండి.. ఏపీలో కొత్త పథకం రెడీ

| Edited By:

Aug 20, 2019 | 3:23 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయాలని ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ గృహ వసతి కల్పించేలా ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు ఇవ్వనున్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి.. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు ఈ పథకానికి అర్హులు. రెండున్నర ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమి […]

మీకు సొంతిల్లు లేదా..  ఉగాది వరకు ఆగండి.. ఏపీలో కొత్త పథకం రెడీ
Follow us on

ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయాలని ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ గృహ వసతి కల్పించేలా ప్రభుత్వం విధివిధానాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అపార్టుమెంట్లు ఇవ్వనున్నారు.

తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి.. గతంలో ప్రభుత్వం నుంచి ఇళ్లు పొందని వారు ఈ పథకానికి అర్హులు. రెండున్నర ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారిని కూడా ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఇక దీనికోసం స్థలాల సేకరణ, కొనుగోలుపై జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. పథకం అమలుపై మంత్రులు అధికారులతో రాష్ట్ర స్ధాయిలో రెండు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. వీరితో పాటు జిల్లా స్ధాయిలో అధికారులతో మరో కమిటీ కూడా దీన్ని సమీక్షిస్తుంది. ఈ గృహ నిర్మాణ పథకం వచ్చే ఉగాదికి ప్రారంభం కానుంది.