హైదరాబాద్‌లో హాస్టళ్లలో ఉంటున్నవారికి ఊరట.. సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి..

| Edited By:

Mar 25, 2020 | 7:06 PM

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టల్ యజమానులు విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు.

హైదరాబాద్‌లో హాస్టళ్లలో ఉంటున్నవారికి ఊరట.. సొంతూళ్లకు వెళ్లేందుకు పోలీసుల అనుమతి..
Follow us on

కోవిద్ 19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టల్ యజమానులు విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. అమీర్‌పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో హాస్టళ్లను ఖాళీ చేయాలని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో యువతీ యువకులు బుధవారం ఆందోళనకు దిగారు. అమీర్‌పేట, పంజాగుట్టలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న వీరంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటికి వెళ్లిపోవడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ వారంతా పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో ఎలాంటి ఆటంకం లేకుండా స్వగ్రామలకు వెళ్లేలా పోలీసులు పాసులు మంజూరు చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చెక్‌పోస్ట్‌ల వద్ద ఎలాంటి ఆటంకం లేకుండా విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లేలా పాసులు మంజూరు చేశామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. కాగా, ఎస్‌ఆర్‌నగర్‌ వద్ద విద్యార్థులు తమకు అనుమతి పత్రాలు ఇవ్వాలంటూ గుంపులు గుంపులుగా రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాల కోసం హాస్టల్‌ ఓనర్‌ నుంచి లెటర్‌ తీసుకురావాలని, వారిని తిరిగి హాస్టళ్లకు పంపించారు.