
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో తాగిన మత్తులో కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. మద్యం మత్తులో.. నియంత్రణ కోల్పోవడంతో.. కారు అదుపుతప్పి పాదాచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది దాకా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ యాక్సిడెంట్ షాకింగ్ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.