రాశి ఫలాలు: శనివారం అక్టోబర్ 5, 2019

| Edited By:

Oct 05, 2019 | 10:01 AM

మేషం: ఈరోజు మేషరాశి వారికి అన్ని కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి. ఇంటా బయటా పైచేయిగా ఉంటుంది. బుణాలు కొంతవరకు తీరతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. సంతానం విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వృషభం: ఈ రోజు వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత మేర జాగ్రత్తలు పాటించడం అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు. మిథునం: […]

రాశి ఫలాలు: శనివారం అక్టోబర్ 5, 2019
Follow us on

మేషం: ఈరోజు మేషరాశి వారికి అన్ని కలిసి వచ్చే అంశాలే ఉన్నాయి. ఇంటా బయటా పైచేయిగా ఉంటుంది. బుణాలు కొంతవరకు తీరతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. సంతానం విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

వృషభం: ఈ రోజు వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో కొంత మేర జాగ్రత్తలు పాటించడం అవసరం. చేతులు, చెవులు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశముంటుంది. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో చికాకులు.

మిథునం: ఈ రాశి వారు ఈరోజు మానిసికంగా ఉల్లాసంగా, ఆనందంగా ఉంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో  డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యం పదిలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి కాస్త అనుకూలం.

కర్కాటకం: ఈరోజు కర్కాటక రాశివారు ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతారు. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగంలో.. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆర్థికంగా.. బలపడతారు. ఎక్కువగా ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగంలో కాస్త చికాకులు ఏర్పడుతాయి.

సింహం: ఈరాశి వారికి కూడా అన్ని అనుకూల ఫలితాలే ఈరోజు ఉన్నాయి. చేపట్టిన ప్రతీ కార్యక్రమం సఫలమవుతుంది. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి ధన లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభాలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు.

కన్య: ఈ రోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు గురికాకండి.

తుల: ఈ రోజు తుల రాశి వారికి ఆర్థికంగా అనుకూలిస్తుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది. అదనపు బాధ్యతలు పెరిగినా.. సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజంతా ఆనందంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలం.

వృశ్చికం: ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సానుకూలంగా.. వ్యవహరించడం. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే ప్రమాదముంది. బద్దకానికి, అసూయకి తావునివ్వకండి. ఆర్థికంగా బావుంటుంది. ఈరోజు ఉల్లసంగా.. సంతోషంగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు ఉన్నాయి.

ధనుస్సు: ఈ రోజు ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంది. మీ వృత్తి పరంగా.. మంచి గుర్తింపు పొందుతారు. ఉద్యోంలో ప్రమోషన్ లేదా బదిలీ కొరకు ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. మానసికంగా ఉల్లాసంగా.. ఆనందంగా ఉంటారు.

మకరం: వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారలలో అభివృద్ధి సాధిస్తారు. జీవితభాగస్వామి నుంచి ఆస్తి లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

కుంభం: చేపట్టిన ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారమైన విషయాలలో మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు.

మీనం: మీనరాశి వారు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. మీ పిల్లలతో.. ఆనందంగా గడుపుతారు.